దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలోని పలు రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే రైళ్లలో కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్ రైళ్లుగా.. ప్యాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా మార్పు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 872 రైళ్లు ఉండగా వాటిలో 673 రైళ్ల వేగాన్ని పెంచుతున్నట్లు తెలిపింది. మరికొన్ని రైళ్ల టెర్మినల్‌ స్టేషన్లలో మార్పులు తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఈ మార్పులన్నీ అక్టోబర్ 1వ తేదీ (ఎల్లుండి) నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అక్టోబర్‌ 1 నుంచి రైళ్లలో ప్రయాణాలు చేసే వారంతా ముందస్తుగా రైళ్ల టైమింగ్స్ తెలుసుకోవాలని సూచించింది. 

సూపర్‌ పాస్ట్‌గా మారనున్న రైళ్ల వివరాలు (కొత్త రైలు నంబర్లు)
సికింద్రాబాద్ - మణుగూరు ఎక్స్‌ప్రెస్ (02745/02746)
నర్సాపూర్ - నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ (02713/02714)
కాచిగూడ - మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (02777/02778)
సికింద్రాబాద్ - రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (02755/02756)
కాకినాడ టౌన్ - భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ (02699/02700)
సికింద్రాబాద్ - హైసర్ ఎక్స్‌ప్రెస్ (02789/02790)

ఎక్స్‌ప్రెస్‌గా మారనున్న ప్యాసింజర్ రైళ్ల వివరాలు..

పాత నెంబర్ రూట్ కొత్త నెంబర్
57121 కాజీపేట్-సిర్పూర్ టౌన్ 07272
57122 సిర్పూర్ టౌన్ - కాజీపేట్ 07271
57123 భద్రాచలం రోడ్ - సిర్పూర్ టౌన్ 07260
57124 సిర్పూర్ టౌన్ - భద్రాచలం రోడ్ 07259
57381 గుంటూర్- నర్సాపూర్ 07267
57382 నర్సాపూర్- గుంటూర్ 07268
57547 హైదరాబాద్ డెక్కన్- పూర్ణా 07653
57548 పూర్ణా- హైదరాబాద్ డెక్కన్ 07654
57549 హైదరాబాద్ డెక్కన్ - ఔరంగబాద్ 07049
57550 ఔరంగబాద్- హైదరాబాద్ డెక్కన్ 07050
57563 నాందేడ్- తాండూర్ 07691
57564 తాండూర్- నాందేడ్ 07692
67241 విజయవాడ - కాకినాడ పోర్ట్ 07273
67242 కాకినాడ పోర్ట్- విజయవాడ 07264
67243 కాకినాడ పోర్ట్ - విశాఖపట్నం 07265
67244 విశాఖపట్నం - కాకినాడ పోర్ట్ 07266
67297 గుడూరు - విజయవాడ 07261
67298 విజయవాడ -గుడూరు 07262
77281 గుంటూరు - కాచిగూడ 07269
77282 కాచిగూడ- గుంటూరు 07270
77693 కాచిగూడ -రాయిచూర్ 07797
77694 రాయిచూర్ - కాచిగూడ 07798

Also Read: వైఎస్‌ షర్మిలతో ప్రశాంత్‌ కిషోర్‌ బృందం భేటీ.. పాదయాత్రపై చర్చ!

Also Read: జగతి పబ్లికేషన్స్‌ కేసులో దర్యాప్తు పూర్తయింది.. సీబీఐ కోర్టుకు తెలిపిన ఈడీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి