జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడుల కేసులో దర్యాప్తు పూర్తయిందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరేక్టరేట్‌ (ED) సీబీఐ కోర్టుకు తెలిపింది. జగతి పబ్లికేషన్స్‌, పెన్నా, ఇండియా సిమెంట్స్‌ ఈడీ కేసులపై దర్యాప్తు పూర్తయిందా? లేదా కొనసాగుతోందా? అనేది తెలపాలని ఈడీని న్యాయస్థానం ప్రశ్నించిన నేపథ్యంలో ఈ మేరకు వెల్లడించింది. ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి, విజయ సాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌ ప్రమేయంపై దర్యాప్తు పూర్తి అయిందని పేర్కొంటూ సీబీఐ కోర్టులో ఈడీ మెమో దాఖలు చేసింది. దీంతో అభియోగాల నమోదు, డిశ్ఛార్జ్ పిటిషన్లపై వాదనలు వినిపించాలని జగన్‌, విజయ సాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌ను సీబీఐ కోర్టు ఆదేశించింది. వాదనలు వినిపించేందుకు ఇదే ఆఖరి అవకాశం అని కోర్టు స్పష్టం చేసింది. జగన్‌, విజయ సాయిరెడ్డి డిశ్ఛార్జ్ పిటిషన్లపై కౌంటర్ల దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది.


శామ్యూల్‌ డిశ్ఛార్జ్ పిటిషన్‌పై వాదనల కోసం ఇండియా సిమెంట్స్‌ కేసును అక్టోబరు 1వ తేదీకి వాయిదా పడింది. ఇక రాజగోపాల్‌ డిశ్ఛార్జ్ పిటిషన్‌పై వాదనల కోసం రఘురాం సిమెంట్స్‌ కేసు అక్టోబరు 4వ తేదీకి వాయిదా పడింది. ఎమ్మార్‌ కేసులో కోనేరు మధు ప్రమేయంపై సమాచారం కోరుతూ విదేశాలకు పంపించిన ఎల్‌ఓఆర్‌లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలపాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. ఎమ్మార్‌ కేసులో తదుపరి దర్యాప్తుపై వివరాలు తెలిపేందుకు 2 వారాలు గడువు కావాలని ఈడీ కోర్టును కోరింది. ఎమ్మార్‌ ఈడీ కేసును అక్టోబరు 12వ తేదీకి, సీబీఐ కేసును అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. 


Also Read: పోసానిపై జనసేన ఫిర్యాదు.. లీగల్‌ ఒపీనియన్‌ కోరిన పోలీసులు


సీబీఐ కోర్టు విచారణ
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసును సీబీఐ కోర్టు విచారిస్తోంది. పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై త్వరగా ఏదోకటి తేల్చాలంటూ సుప్రీం కోర్టు గడువు విధించింది. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు కేసుల పరిష్కారానికి సిద్ధమవుతోంది. జగన్ నిందితుడిగా ఉన్న పెన్నా సిమెంట్స్ కేసులో డిశ్ఛార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పెన్సా సిమెంట్స్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడాన్ని సీబీఐ తప్పుబట్టింది. ఈ కేసుల్లో జగన్‌ను ఏ1గా చేర్చినట్లు తెలిపింది. దీనిపై జగన్ సీబీఐ కోర్టులో డిశ్ఛార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. పెన్నా సిమెంట్స్ ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలని కోర్టును కోరారు. దీనిపై సీబీఐ వెల్లడించిన వివరాల ఆధారంగా సీబీఐ కోర్టు విచారణ జరపనుంది.


Also Read: ఏపీలో కొత్తగా వెయ్యికి పైగా కరోనా కేసులు.. ఓ జిల్లాలో తీవ్ర ప్రభావం


Also Read: నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన.. కనీస స్టైఫండ్ ఇవ్వలేదని ఆరోపణ..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి