నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కోవిడ్ కష్టకాలంలో డ్యూటీలు చేసినా తమకు గుర్తింపు లేదని, కనీసం ఇంటెన్సివ్ స్టైఫండ్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. మాజీ మంత్రి నారాయణ వచ్చి మాట్లాడతారని సర్ది చెబుతున్నారే కానీ, ఇప్పటి వరకూ ఆయన రాలేదని వ్యాఖ్యానించారు. నారాయణ వచ్చే వరకు తమ ఆందోళన విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. తమకు న్యాయం జరిగే వరకు క్లాసులకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు బంద్ చేపట్టారు.
కోవిడ్ సమయంలో మెడికల్ కాలేజీ స్టూడెంట్స్‌తో కూడా ఎమర్జెన్సీ డ్యూటీలు చేయించుకున్నారని ఆరోపించారు. దీనికి గానూ తమకు ప్రత్యేకంగా స్టైఫండ్ ఇవ్వలేదని.. దాదాపు 2 నెలలపాటు పీపీఈ కిట్లు వేసుకుని లైఫ్ రిస్క్ చేశామని వాపోయారు. తీరా ఇప్పుడు కనీసం తాము చేసిన పనికి డబ్బులు అడుగుతున్నా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థులంతా కలసి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
ఇతర కాలేజీలు ఇస్తేనే ఇస్తామని మెలిక..
కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు విధులు నిర్వర్తించాక తమలో చాలా మంది వైరస్ బారిన పడ్డారని విద్యార్థులు పేర్కొన్నారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి డ్యూటీలు చేసినా.. తమకు ఇన్సెంటివ్ స్టైఫండ్ ఇవ్వడానికి యాజమాన్యం సుముఖంగా లేదని వాపోయారు. ఇతర ప్రైవేటు కాలేజీలు ఇస్తేనే తాము కూడా ఇస్తామంటూ మెలిక పెట్టిందని.. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు.
స్టైఫండ్ పెంచాలి..
ప్రభుత్వ కాలేజీల్లో వైద్య విద్యార్థులకు రూ. 20,000 స్టైఫండ్ ఇస్తున్నారని తమకి నెలకి రూ. 2,000 కంటే తక్కువ ఇస్తున్నారని చెప్పారు. రోజుకి రూ. 60 స్టైఫండ్‌తో తామేం చేయాలని ప్రశ్నించారు. 2006 లెక్కల ప్రకారం స్టైఫండ్ ఫిక్స్ చేశారని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ఖర్చుల దృష్ట్యా తమకు స్టైఫండ్ పెండాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
Also Read: Pavan In YSRCP : వైఎస్ఆర్‌సీపీలో చేరేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నం ! అప్పుడేం జరిగిందంటే ?
విద్యార్థులు రోడ్డెక్కడంతో కలకలం..
వైద్య విద్యార్థులు రోడ్డెక్కడంతో నెల్లూరు నారాయణ కాలేజీ వద్ద కలకలం రేగింది. యాజమాన్యం నాలుగైదు రోజుల నుంచి సర్ది చెప్పాలని చూసినా ఫలితం లేకపోయింది. మాజీ మంత్రి నారాయణతో మాట్లాడిస్తామని యాజమాన్యం నమ్మకంగా చెబుతూ తమను మోసం చేస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
Also Read: AP Aided Schools : ఎయిడెడ్ స్కూళ్లకు సాయం నిలిపివేయడం లేదు.. హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Also Read: Pawan Kalyan In Mangalagiri: పవన్ కళ్యాణ్ మంగళగిరి పర్యటనపై ఏపీలో కొనసాగుతోన్న ఉత్కంఠ