కృష్ణపట్నం ఆనందయ్య కరోనా టైమ్ లో చాలా ఫేమస్ అయ్యారు. కరోనాకు ఆనందయ్య కనిపెట్టిన ఆయుర్వేద మందు దేశవ్యాప్తంగా మార్మొగింది. కరోనాకు అప్పటికే వ్యాక్సిన్ వచ్చినా.. ఆస్పత్రుల్లో చికిత్స అందుబాటులో ఉన్నా.. వాటిని కాదని.. లక్షలాది మంది నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి పరుగులు పెట్టారు. అక్కడ ఆనందయ్య ఇచ్చే కరోనా ఆయుర్వేద మందు కోసం ఎగబడ్డారు.
ఆనందయ్య మందు తీసుకున్న తర్వాతే తమకు కరోనా తగ్గిపోయిందని.. విషమ పరిస్థితుల నుంచి క్షేమంగా ఇంటికి వెళ్లామని చాలా మంది చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆనందయ్య మందు గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే ఇన్నీ రోజులు సైలంట్ గా ఉన్న ఆనందయ్య తాజాగా ఓ ప్రకటన చేశారు.
తాను రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నట్లు ఆనందయ్య అనౌన్స్ చేశారు. దేశ వ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతోందని.. బీసీ నేతలంతా కలిసి ప్రస్తుత పరిస్థితులపై చర్చిస్తున్నట్టు ఆనందయ్య తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో బీసీల కోసం పార్టీ రాబోతుందని.. ఏపీలో బీసీల పార్టీకి తాను ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అఖిల భారత యాదవ సమాఖ్య సమీక్షలు చేపడుతున్నట్లు ఆనందయ్య వెల్లడించారు.
ప్రస్తుతం ఏపీలో నలుగురు మాత్రమే యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారని ఆనందయ్య చెప్పారు. పార్టీలు చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేదన్నారు. సర్పంచిగా పనిచేశానని, ప్రస్తుతం ఎంపీటీసీగా ఉన్నానని ఆనందయ్య చెప్పారు. అన్నీ కుదిరితే.. ఎమ్మెల్యే కూడా అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. 2022 ఏప్రిల్, మే నెలల్లో రథయాత్ర నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆనందయ్య వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదని ఆనందయ్య కొన్ని సార్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా.. 13 జిల్లాల్లో ఆయుర్వేదం మందు పంపిణీ చేశారు. ఆయన స్వయంగా మందును తయారుచేశారు. తన అనుచరులు మందు పంపిణీలో కృషి చేశారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read: Budvel By Election : బద్వేలు బరిలో బీజేపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థి ! పోటీకి ఎవరు ముందుకు వస్తారు ?
Also Read: Pavan In YSRCP : వైఎస్ఆర్‌సీపీలో చేరేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నం ! అప్పుడేం జరిగిందంటే ?
Also Read: Badvel Bypoll: బద్వేలు ఉప ఎన్నిక బరిలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే..