జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారా? . అసలు ఈ ప్రశ్నే కాస్త విచిత్రంగా ఉంటుంది కదా ! కానీ నిజమేనట. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఈ విషయాన్ని చెబుతున్నారు.  తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన ఆలయం ముందే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. జగన్‌ను విమర్శించే అర్హత పవన్ కల్యాణ్‌కు లేదని ఆయన తేల్చేశారు. అంత వరకూ అని ఆగి ఉంటే బాగుండేది... కానీ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నించారని.. కానీ జగన్ దరి చేరనీయలేదని ఆయన ప్రకటించారు. 


Also Read : నా శ్వాస ఉన్నంత వరకూ మీరే నా దైవం..బండ్ల గణేష్ ట్వీట్ వైరల్


పవన్ కల్యాణ్‌ తన పార్టీ జనసేనను విలీనం చేయాలని బీజేపీ అగ్రనేతలు ఒత్తిడి చేశారని పలుమార్లు చెప్పారు. అయితే తన పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదని ఓపిక ఉన్నంత కాలం నడుపుతానని ఆయన బహిరంగంగానే చెప్పారు. బీజేపీ లాంటి జాతీయ పార్టీలో ఆయన పార్టీని విలీనం చేస్తే రాష్ట్ర స్థాయిలో ఆయన జాతీయపార్టీకి ప్రముఖ నేతగా ఉంటారు. అలాంటి అవకాశాన్ని కూడా వదులుకున్న పవన్ కల్యాణ్ ప్రాంతీయ పార్టీ అదీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్ లీడర్‌గా ఉండే వైఎస్ఆర్ సీపీలో చేరే ప్రయత్నం చేశారన్న మంత్రి ప్రకటన నమ్మశక్యంగా లేదని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. 


Also TRead: ''ఈ చెత్త మన చుట్టూ జరుగుతుందా..? ఛీ'' నాగార్జున కామెంట్స్


అదే ప్రెస్‌మీట్‌లో  జగన్‌పై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు. అయితే ఆయన పవన్ కల్యాణ్‌పై అనబోయి పొరపాటున జగన్ అని అన్నారని అక్కడున్న వారికి అర్థమైంది. ఆయన జగన్ గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేసే అవకాశం లేదు. అలాగే పవన్ కల్యామ్ కూడా వైఎస్ఆర్‌సీపీలో చేరేందుకు ప్రయత్నించారని చేసిన వ్యాఖ్యల్లోనూ ఆయన తడబడ్డారన్న అభిప్రాయం వినిపిస్తోంది. బహుశా ఆయన గత ఎన్నికలకు ముందు పొత్తుల గురించి మాట్లాడి ఉంటారన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీని ఓడించడానికి అప్పట్లో జనసేనతో వైఎస్ఆర్‌సీపీ పొత్తుల గురించి ప్రాథమికంగా చర్చలు జరిగాయన్న ప్రచారం జరిగింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే పొత్తుల గురించి మాట్లాడి ఉంటారు కానీ.. వైఎస్ఆర్‌సీపీలో పవన్ చేరిక గురించి కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


Also Read : పోలీసుల కళ్లుగప్పి ఏపీ నుంచి యూపీకి భారీ స్మగ్లింగ్.. 972 కేజీల గంజాయి సీజ్


మంత్రి నారాయణ స్వామి ఇలాంటి ఊహకు అందని ప్రకటనలు చేయడం ఇదే మొదటి సారి కాదు. ఆయన ఓ రకమైన రాజకీయ ఊహాగాలను తనదైన పద్దతిలో మీడియా ఎదుట ప్రకటిస్తూ ఉంటారు. గతంలో చంద్రబాబు తనకు మంత్రి పదవి ఆఫర్ చేసి టీడీపీలోకి ఆహ్వానించారని కూడా చెప్పుకున్నారు. కానీ పలుమార్లు మీడియాతో మాట్లాడేందుకు కూడా మంత్రి పెద్దిరెడ్డి పర్మిషన్ అడుగుతూ కెమెరాలకు చిక్కారు. పవన్ కల్యాణ్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రకరకాలుగా విమర్శిస్తున్నారు. మిగతా వారందరిదీ బూతుల స్థాయి అయితే మంత్రి నారాయణ స్వామిది మరో రేంజ్ విమర్శలు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 


Also Read : సంగం డెయిరీ పాలకవర్గంపై పెట్టిన కేసుపై హైకోర్టు స్టే !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి