(Vivek Tripathi/ABP News Network)
ఎన్ని కఠిన చట్టాలు అమలవుతున్నా డ్రగ్ స్మగర్లు మాత్రం వాటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఏదో ఓ తీరుగా ఒక్కో రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇలా దేశమంతా గంజాయి, మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరాది రాష్ట్రానికి తరలిస్తోన్న భారీ డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేశారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఏకంగా 972 కేజీల గంజాయి అక్రమ రవాణాను గుర్తించి, చాకచక్యంగా పట్టుకున్నారు. 


గత కొన్ని రోజులుగా ఏపీలో గంజాయి రవాణా, డ్రగ్స్ సరఫరా వివాదం నడుస్తుండగా ఏపీ నుంచి ఉత్తరాధిన యూపీకి తరలిస్తోన్న గంజాయిని డీఆర్ఐ అధికారులు సీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గంజాయి స్మగ్లింగ్ గురించి ముందుగానే సమాచారం అందుకున్న డీఆర్ఐ టీమ్ యూపీలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో ఏపీ నుంచి ఓ ట్రక్కులో రహస్యంగా గంజాయి తరలిస్తుండగా లక్నో సమీపంలో డ్రగ్స్ సరఫరా ముఠాను గుర్తించారు. అనుమానం వచ్చి ట్రక్కును పరిశీలించగా మొదట్లో అందులో ఏమీ లేదని డీఆర్ఐ అధికారులు భావించారు. కానీ క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు షాక్ తిన్నారు. అందులో ప్యాకెట్ల రూపంలో ప్యాకింగ్ చేసి తరలిస్తోన్న గంజాయిని గుర్తించారు. ట్రక్కులో గంజాయి తరలిస్తోన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ట్రక్కును, 972 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు.


Also Read: ఆ హెరాయిన్ తో విజయవాడకు సంబంధం లేదు... ఏపీ డీజీపీ కీలక ప్రకటన... వాస్తవాలు మాట్లాడాలని నేతలకు హితవు


ఏపీ నుంచి లక్నో.. వయా ప్రయాగ్ రాజ్..
ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ మొత్తంలో గంజాయి సరఫరా అవుతుందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) కి సమాచారం అందింది. దాదాపు వెయ్యి కేజీల మేర గంజాయిని ఉత్తరాధి రాష్ట్రాలకు ట్రక్కులో తీసుకెళ్తున్నారని తెలుసుకున్న డీఆర్ఐ ముమ్మర తనిఖీలు చేపట్టింది.  మొదటగా ఏపీ నుంచి ప్రయాగ్ రాజ్‌కు ట్రక్కులో ముగ్గురు వ్యక్తులు గంజాయి స్మగ్లింగ్ చేశారు.


ఆగ్రా ఎక్స్ ప్రెస్ వే మీద డీఆర్ఐ అధికారులు నిఘా ఉంచి.. అనుమానం ఉన్న వాహనాలపై తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రయాగ్ రాజ్ నుంచి లక్నోకు వచ్చిన గంజాయి ట్రక్కు అక్కడి నుంచి ఆగ్రా ఎక్స్ ప్రెస్ వే చేరుకోగానే డీఆర్ఐ అధికారులు వారిని అడ్డుకున్నారు. వాహనాన్ని నిలిపి తనికీ చేయగా 972 కేజీల గంజాయి స్మగ్లింగ్ విషయం గుర్తించినట్లు తెలిపారు. ఏ అనుమానం రాకుండా నిందితులు ట్రక్కులో ఏర్పాట్లు చేసుకుని గంజాయి స్మగ్లింగ్ చేశారని.. ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.


Also Read: యూట్యూబ్ లో ఆత్మహత్య వీడియో చూసి బాలిక బలవన్మరణం... తల్లికి ముందే ఆ వీడియో చూపించిన చిన్నారి... బంధువులు మరో ఆరోపణ


కోల్‌కతాకు చెందిన వ్యక్తి వీరితో గంజాయి స్మగ్లింగ్ డీల్ కుదుర్చుకున్నట్లు వారి ప్రాథమిక విచారణలో తేలింది. బెంగాల్ వాసిని బిహార్ రాష్ట్రానికి చెందిన ప్రధాన నిందితుడిని పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. అతడి ద్వారా ఏపీ నుంచి భారీగా గంజాయి స్మగ్లింగ్ అవుతున్నట్లు డీఆర్ఐ తెలుసుకుంది. తనిఖీలు చేపట్టి గంజాయి స్మగ్లింగ్ గ్యాంగ్ ఆట కట్టించారు. ఎన్సీఆర్‌కు గంజాయిని తరలించినట్లు సమాచారం.


Also Read: పోలీసుల అత్సుత్సాహం... డెలివరికి వెళ్తున్న గర్భిణీ కారును 40 నిమిషాలు నిలిపేసిన ఖాకీలు..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి