సామాజిక మాధ్యమాల్లో లైవ్ సూసైడ్  చేసుకుంటున్న విపరీత ధోరణలు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. ఇవి చిన్నారులపై ప్రభావం చూపుతున్నాయి. తాజాగా యూట్యూబ్ వీడియో చూసి ఓ చిన్నారి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట పోలీస్ స్టేషన్ పక్క వీధిలో 13 సంవత్సవరాల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక తన అమ్మమ్మ ఇంటి వద్ద బాత్ రూమ్ లో గొంతు కోసుకొని మృతి చెందిందని ఆమె తల్లి అంబాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూట్యూబ్ లో వీడియోలు చూసి గొంతు కోసుకున్నట్లు బాలిక తల్లి  ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలిక తల్లి అత్తారిల్లు విజయవాడ కాగా భర్త మరణించడంతో గత రెండు సంవత్సరాలుగా పుట్టిలైన అంబాజీపేటలో తన కూతురుతో  కలిసి ఉంటున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అంబాజీపేట ఎస్ఐ తెలిపారు. 


Also Read: క్రికెట్ బెట్టింగ్ కు యువకుడు బలి... నెల్లూరు జిల్లాలో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య


విచారణలో సంచలన విషయాలు


చిన్న వయసులో సోషల్ మీడియా వీడియో చూసి ప్రాణాలు తీసుకుంది బాలిక. తన తల్లికి ముందే ఆ వీడియో చూపించింది. అనంతరం బలవన్మరణానికి పాల్పడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూట్యూబ్ లో వీడియోలు చూసిన బాలిక గొంతు కోసుకున్నట్లు అంబాజీపేట పోలీసులు గుర్తించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Also Read:  పోలీస్ స్టేషన్ లో ప్రేమ పంచాయితీ... తల్లిదండ్రులకు కౌన్సెలింగ్... కానీ


కుటుంబ కలహాలతో సూసైడ్..!


సోమవారం ఉదయం తల్లికి యూట్యూబ్‌లో సూసైడ్ వీడియో చూపించింది బాలిక. ఇంతలో తెల్లవారే సరికి విగతజీవిగా పడి ఉండటంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. భర్త మరణించడంతో గత నాలుగు నెలలుగా అంబాజీపేటలో తన కూతురుతో కలిసి ఉంటోంది బాలిక తల్లి. అయితే, కుటుంబం కలహాలతోనే బాలిక సూసైడ్ చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.


Also Read: ఫేస్ బుక్ లైవ్ పెట్టి వ్యక్తి ఆత్మహత్య.. కారణం భార్య, అత్తేనా?


Also Read: మ్యాట్రిమోనీలో పరిచయం.. పిలిస్తే రూంకి వెళ్లిన యువతి, ఊహించని ఝలక్ ఇచ్చిన యువకుడు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి