సంచలనం సృష్టించాయి. రాబోయే ఎన్నికలకు  మంచు విష్ణు చాలా వ్యూహాత్మకంగా ఎజెండా ఖరారు చేశారని అంటున్నారు. ఇంతకూ ఆ అజెండా ఏమిటంటే "పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు సమర్థింపుగా ప్రకాష్ రాజ్.. వ్యతిరేకంగా మంచు విష్ణు ప్యానల్‌"ను ఎంచుకోవడం.  అంటే పవన్ వ్యాఖ్యలే ఎజెండాగా మా ఎన్నికలు  మారిపోయాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


Also Read : వైసీపీ ప్రభుత్వంపై మరోసారి పవన్ ఫైర్... ఉగ్రవాద పాలసీ అంటూ విమర్శలు...


రిపబ్లిక్ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో  పవన్ కల్యాణ్ .. ఇండస్ట్రీ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. అయితే ఆయన వ్యాఖ్యలను ఫిల్మ్ చాంబర్ తప్పు పట్టింది. కానీ నాని, కార్తికేయ వంటి హీరోలు బహిరంగంగా పవన్ కల్యాణ్ చెప్పింది నిజమేనని ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని కోరారు. మరికొంత మంది హీరోలు బయటకు చెప్పలేకపోతున్నారు కానీ పవన్‌కు మద్దతుగా ఉండటానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం ఉంది. అయితే అదంతా ప్రభుత్వం - సినీ ఇండస్ట్రీ మధ్య ఉన్న సమస్య. కానీ అనూహ్యంగా మంచు విష్ణు ఈ అంశాన్ని  "మా" ఎన్నికలకు ముడి పెట్టారు. తనను తాను ఇండస్ట్రీ వైపు ఉన్నానని చెప్పుకున్నారు. ప్రకాష్ రాజ్ ఎవరి వైపు ఉన్నారో చెప్పాలన్నారు. 


Also Read : పేద కళాకారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. బండ్ల గణేష్ ‘మా’ హామీ!


రెండు రోజుల కిందట నామినేషన్ వేసిన ప్రకాష్ రాజ్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు కానీ ఆయన పవన్ కల్యాణ్ మంచి నాయకుడని.. మార్పు కోసం పని చేస్తున్నాడరని అభినందించారు. మిగతా విషయాలు ఏమైనా ఉంటే పదో తేదీ తర్వాత మాట్లాడుకుందామని అన్నారు. అంటే మా ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పారు. మోహన్ బాబు కూడా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై పదో తేదీ తర్వాతనే స్పందిస్తానని చెప్పారు. ఈ క్రమంలో అసలు మా ఎన్నికల మీదే అందరూ దృష్టి పెడతారని అనుకున్నారు. కానీ వద్దనుకున్నా రాజకీయాలు చొచ్చుకు వస్తున్నాయి. ఇప్పుడు ఎజెండా కూడా సెట్ అయిపోయింది.


Also Read : పవన్ వాఖ్యలతో టాలీవుడ్ పరేషాన్.. బడా, చోటా నిర్మాతలు తలోదారి.. సినీ పెద్దలు సేఫ్ గేమ్!


"మా" ఎన్నికల్లో మంచు విష్ణుకు అత్యధిక ఓట్లు పడి ఆయన ప్యానల్ గెలుపొందితే.. ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలో నిజం లేదని ..ప్రభుత్వం అంటే సినీ ఇండస్ట్రీకి మంచి అభిప్రాయం ఉందని అనుకోవాలి. ఒక వేళ ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు అత్యధిక ఓట్లు లభిస్తే ఆయన వాదానికే ఇండస్ట్రీ మొగ్గు  ఉందని భావించాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువ మెజార్టీ ఎవరికి వస్తే వారి వాదానికే బలం ఉన్నట్లుగా భావించే పరిస్థితి ఏర్పడుతోంది. మంచు విష్ణు కావాలని చేశారో.. వ్యూహాత్మకంగా చేశారో  కానీ ఎజెండా మాత్రం సెట్ అయింది.


Also Read: పవన్ ‘మా’ సభ్యుడే.. ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు: ప్రకాష్ రాజ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి