అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించిన తర్వాత అక్కడి పౌరులకు తాలిబన్లు రోజుకో షాక్ ఇస్తున్నారు. తాజాగా హెయిర్ కటింగ్ షాపుల్లో గడ్డం తీయడం, ట్రిమ్మింగ్ చేయడాన్ని బ్యాన్ చేస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. ఇది కూడా ఇస్లామిక్, షరియా చట్టాలకు లోబడే తీసుకున్న నిర్ణయమన్నారు.
ఇదేంట్రా బాబు..
దక్షిణ అఫ్గానిస్థాన్‌లోని హెల్మండ్ రాష్ట్ర రాజధాని లష్కర్ గాహ్‌లో ఈ మేరకు ప్రకటించారు తాలిబన్లు. దీనిపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ ఆదేశాలను అతిక్రమించిన వాళ్లు శిక్షార్హులని తాలిబన్లు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ ఆదేశాలను ఉల్లంఘించిన బార్బర్లకు ఎలాంటి శిక్షలు విధిస్తారనే దానిపై మాత్రం స్పష్టత లేదు.
మళ్లీ అదే పాలన..
ఇంతకుముందు తాలిబన్ల పాలనలో పురుషులు గడ్డం పెంచుకోవాలని ఆదేశాలిచ్చారు. అయితే తాలిబన్ల ప్రభుత్లం కూలిన తర్వాత షేవింగ్, ట్రిమ్మింగ్ దేశంలో ఎక్కువగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ తిరిగి తాలిబన్లు అవే నిబంధనలు తీసుకురావడంపై అఫ్గాన్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతకుముందు అఫ్గాన్‌ను పరిపాలించిన తాలిబన్లు ఇస్లామ్ చట్టాలను బలవంతంగా ప్రజలతో పాటించేలా చేశారు. ప్రస్తుతం మళ్లీ అదే తరహాలో విచిత్రమైన ఆదేశాలను జారీ చేస్తున్నారు తాలిబన్లు.
శనివారం.. నలుగురు కిడ్నాపర్లను చంపి వాళ్ల మృతదేహాలను హేరత్ నగర నడిబొడ్డున వేలాడదీశారు తాలిబన్లు. ఇది చూసిన ప్రజలు మరోసారి అఫ్గాన్.. అదే తాలిబన్ల అరాచక పాలనలోకి జారుకుంటోందని భయపడుతున్నారు.
Also Read: India Covid Cases: దేశంలో తగ్గిన కోవిడ్ కేసులు.. కొత్తగా 18,795 నమోదు.. 201 రోజుల్లో ఇవే అత్యల్పం..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి