జనసేన - వైఎస్ఆర్ కాంగ్రెస్‌ల మధ్య రాజకీయ పోరాటం రోడ్ల మీదకు చేరే అవకాశం కనిపిస్తోంది. గాంధీ జయంతి రోజు నుంచి జనసేన గాంధీగిరి నిరసనలు ప్రారంభించబోతోంది. అంటే రోడ్లను స్వయంగా బాగు చేయాలని నిర్ణయించుకుంది. అక్టోబర్ 2వ తేదీన పవన్ కల్యాణ్ రెండు చోట్ల శ్రమదానం చేయబోతున్నారు. ఇప్పటికే విమర్శలు , ప్రతివిమర్శల స్థాయి నుంచి తిట్లు, బూతుల వరకూ వెళ్లిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన రాజకీయాలు ఇక రోడ్ల మీదకు చేరితే పరిస్థితి మరింత దిగజారిపోతుందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది. 


"రిపబ్లిక్" స్పీచ్ తర్వాత పవన్‌పై విరుచుకుపడుతున్న  వైఎస్ఆర్ సీపీ ! 


రిపబ్లిక్ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో ప్రభుత్వంపై  పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ విమర్శలపై వైసీపీ నేతలు.. ఆ పార్టీ సానుభూతిపరులు అందరూ మీడియా ముందుకో.. సోషల్ మీడియా ముందుకో వచ్చి పవన్ కల్యాణ్‌ప విరుచుకుపడుతున్ారు. వీరందరికీ పవన్ కల్యాణ్ సెటైరిక్‌గా సమాధానం ఇచ్చారు. వైఎస్ఆర్ సీపీ గ్రామ సింహాల ఘోంకారాలు సహజమేనన్నారు. దీనికి పేర్ని నాని కూడా ఘాటుగా సోషల్ మీడియాలోనే రిప్లయ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌ను వరాహం అన్న అర్థంలో విమర్శించారు. ఈ వివాదాలు ిలా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.


Also Read : వైసీపీ నేతలకు పవన్ రివర్స్ కౌంటర్... ట్విట్టర్ వేదికగా వరుస పంచ్ లు...


అక్టోబర్ 2 నుంచి రోడ్ల సమస్యపై పవన్ కల్యాణ్ గాంధీగిరి!


గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ నుంచి పవన్ కల్యాణ్  ప్రభుత్వంపై గాంధీగిరి తరహా నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే రోడల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అడుగుకో గుంత, గజానికో గొయ్యి అంటూ ప్రత్యేక డిజిటల్ ఉద్యమాన్ని జనసేన నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రహదారుల ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. పలుగు, పార చేతబట్టి శ్రమదానం చేయాలని నిర్ణయించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఉదయం 10 గంటలకు తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం దగ్గర దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లా కొత్తచెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి-ధర్మవరం రోడ్డును బాగుచేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు ఈ శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటాయి.


Also Read: పవన్ ‘మా’ సభ్యుడే.. ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు: ప్రకాష్ రాజ్


పవన్‌ నిరసనలకు ప్రభుత్వం అనుమతిస్తుందా ?


ఆంధ్రప్రదేశ్‌లో ఓ భిన్నమైన పరిస్థితి ఉంది.  ప్రతిపక్ష నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి పెద్దగా అవకాశం లభించడం లేదు. ఇటీవల ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లాలనుకున్న నారా లోకేష్‌ను కూడా అడ్డుకున్నారు. పలు కేసుల పెట్టారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ప్రతిపక్ష నేతలను నిరసన చేపట్టకుండా చేస్తూ ప్రజాస్వామ్య వ్యతిరేకగా వ్యవహరిస్తోందని ప్రభుత్వంపై పలు పార్టీలు విరుచుకుపడుతున్నాయి. పైగా ప్రస్తుతం వైఎస్ఆర్ సీపీ, జనసేన మధ్య ఓ రకమైన ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ రోడ్డెక్కి శ్రమదానం చేస్తానంటే అనుమతిఇచ్చే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు.


Also Read: అవకాశాల పేరుతో అమ్మాయిని మోసం చేస్తే.. మీరేం చేశారు..? పవన్ పై పోసాని వ్యాఖ్యలు


ముందుగానే రోడ్లను బాగు చేస్తారా ? పవన్ రోడ్డెక్కకుండా అడ్డుకుంటారా ?


పవన్ కల్యాణ్ రెండు చోట్ల రోడ్డను శ్రమదానంతో బాగు చేస్తారని ప్రకటించారు. దీంతో  పవన్ కు కౌంటర్‌గా ప్రబుత్వం ఆ రెండు రోడ్లను తక్షణమైన బాగు చేస్తుందని భావిస్తున్నారు. ఒక వేళ బాగు చేసినా పవన్ కల్యాణ‌్ అదే ప్రాంతంలో ఇతర చోట్ల నిరసన తెలిపే అవకాశం ఉంది. అందుకే రోడ్లపై నిరసన కార్యక్రమాలు, శ్రమదానానికి అనుమతి లేదన్న కారణంగా ఆయనను మంగళగిరిలోనే నిలిపివేస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే జరిగితే గాంధీ జయంతి రోజున మరింత రాజకీయ ఉద్రిక్తత ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. 


Also Read : ఏం సంబంధం ఉందని వైఎస్ఆర్‌సీపీ కోసం శక్తికి మించి పని చేశా ! జగన్ నిరాదరణపై కలకలం రేపుతున్న షర్మిల వ్యాఖ్యలు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి