గులాబ్ తుపాన్ కారణంగా తెలంగాణలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సర్కార్ అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తెలంగాణలోని అన్ని పాఠశాలలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఇవాళ (సెప్టెంబర్ 28) సెలవు ప్రకటించింది. తుపాన్ కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం సీఎస్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర శాఖలు అయినటువంటి పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఫైర్ సర్వీసులు, పంచాయతీ రాజ్, నీటి పారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖలు మాత్రం తప్పనిసరిగా విధి నిర్వహణలో ఉండాలని ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాణ ఆస్తి నష్టం లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. 


Also Read: Cyclone Updates: బలహీనపడ్డ గులాబ్.. తెలంగాణ, ఏపీలో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక్కడ అతిభారీగా..


నేడు, రేపు పలు పరీక్షలు వాయిదా..
గులాబ్ తుపాన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నేడు (సెప్టెంబర్ 28), రేపు జరగాల్సిన పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణలో నేడు, రేపు జరగాల్సిన ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. జేన్‌టీయూ పరిధిలో నేడు (సెప్టెంబర్ 28) జరగాల్సిన అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ అధికారులు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ప్రకటించింది. వాయిదా పడిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. 


Read More: Exams Postponed: గులాబ్ తుపాన్ ఎఫెక్ట్.. నేడు, రేపు పలు పరీక్షలు వాయిదా.. పూర్తి వివరాలివే..


శాసన సభ, మండలి సమావేశాలు వాయిదా.. 
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలను మూడు రోజుల పాటు వాయిదా వేశారు. అక్టోబర్ 1న ఉదయం 10 గంటలకు ఉభయ సభలు తిరిగి సమావేశం అవుతాయని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌రెడ్డిలు వెల్లడించారు. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 


Also Read: Hyderabad Rains: హైదరాబాద్ లో కుండపోత వర్షాలు...కాలనీలు, రహదారులు జలమయం... నేడు, రేపు హై అలర్ట్


Also Read: Crime News: 8 నెలలుగా గ్యాంగ్ రేప్.. శిశువుకు జన్మనిచ్చిన బాలిక.. బిడ్డను ఏం చేశారంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి