దేశంలో కోవిడ్ ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య తగ్గడంతోపాటు రికవరీల సంఖ్య పెరగడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,795 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 3,36,97,581కి చేరింది. 201 రోజుల అనంతరం దేశంలో నమోదైన అతి తక్కువ కేసులు ఇవే కావడం విశేషం. గడిచిన 24 గంటల్లో 13,21,780 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు వెల్లడైంది. ఇక నిన్న 179 మంది కోవిడ్ మహమ్మారితో పోరాడుతూ మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,47,373కి చేరింది. గత 24 గంటల్లో 26,030 మంది కోవిడ్‌ను జయించారు. దీంతో రికవరీల సంఖ్య 32,9,58,002కి (97.81 శాతం) పెరిగింది. ప్రస్తుతం దేశంలో 2,92,206 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 56,57,30,031 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. నిన్న నమోదైన కోవిడ్ కేసుల్లో కేరళలో 11,699.. మహారాష్ట్రలో 2,432 ఉన్నాయి.


ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య  292206గా (0.87 శాతం) ఉంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 1,02,22,525 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటి వరకూ అందించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 87 కోట్లు దాటింది. 









Also Read: Huzurabad Bypoll: హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. పోలింగ్, కౌంటింగ్ తేదీలివే..


Also Read: Cyclone Updates: బలహీనపడ్డ గులాబ్.. తెలంగాణ, ఏపీలో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక్కడ అతిభారీగా..



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి