Just In
Jyoti Malhotra: పాకిస్థాన్ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం!
Gantasala Song in Pakistan Temple: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌లో కటార్సరాజ్ ఆలయాన్ని సందర్శించింది. ఆ సమయంలో అక్కడ ఘంటసాల పాట వినిపించడాన్ని వీడియోలో రికార్డ్ చేసింది..
Jyoti Malhotra: పాకిస్థాన్ లో ఓ ప్రాచీన ఆలయంలో మన ఘంటసాల వెంకటేశ్వరరావు ఆలపించిన పాట వినిపించడం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. గూఢచర్యం ఆరోపణలతో అరెస్టైన భారతీయ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గతంలో షూట్ చేసిన ఓ వీడియో ద్వారా ఈ ఆసక్తికర దృశ్యం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో యూ ట్యూబ్ లో చక్కర్లు కొడుతోంది. సంబరంగా షేర్ చేసుకుని మరీ చూస్తున్నారు సంగీత ప్రియులు.
పైనున్న యూట్యూబ్ వీడియోలో 6 నిముషాల 50 సెకెన్ల నుంచి తెలుగు పాట వినొచ్చు.
హర్యానాలోని హిసర్ కి చెందిన 33 ఏళ్ళ జ్యోతి మల్హోత్రాకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ట్రావెల్ విత్ జ్యో పేరుతో వీడియోస్ చేస్తుంటుంది. ట్రావెల్ విత్ జ్యో పేరుతో యూట్యూబ్ చానెల్ ఉంది. పహల్గాం దాడి జరగడానికి రెండు నెలల ముందు ఆమె కటాస్ రాజ్ గుడిలో ఓ వీడియో షూట్ చేసింది. అక్కడ శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి. జ్యోతి ఆంజనేయుడి ఆలయంలోకి వెళ్లగానే అక్కడ తెలుగు పాట వినిపించంది. ప్రఖ్యాత గాయకుడు ఘంటసాల పాడిన భూకైలాస్ శినమాలో రాముని అవతారం పాట అది. రాముని అవతారం రఘుకుల సోముని అవతారం అంటూ ఆంజనేయుడి ఆలయంలో కూర్చుని ఓవ్యక్తి పాడుతున్న వీడియోని షూట్ చేసింది జ్యోతి. 50 నిముషాల 52 సెకెన్లు ఉన్న ఈ ట్రావెల్ వీడియోలో 6 నిముషాల 50 సెకెన్ల దగ్గర తెలుగు పాట మీరు వినొచ్చు.
పాకిస్థాన్ కోసం గూఢచారిగా మారిందన్న ఆరోపణలతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. ఢిల్లీలో పాక్ హై కమిషన్‌కు చెందిన డానిష్ అనే ఉద్యోగితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఆమె పాకిస్తాన్ కోసం గూఢచారిగా పని చేయటం ప్రారంభించిందనే ఆరోపణలున్నాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనకు రెండు నెలల ముందు జ్యోతి పహల్గాం వెళ్లి వీడియోస్ తీసినట్టు సమాచారం. ఆ సమాచారాన్ని పాకిస్థాన్ ఏజెంట్లకు చేరవేసిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడి జరగడానికి జ్యోతి పంపిన వీడియో కూడా కారణం కావొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఆపరేషన్ సిందూర్ తర్వాత నెలకొన్ని ఉద్రిక్తతక సమయంలోనూ ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో అధికారి డానిష్ తో టచ్ లో ఉన్నట్టు నిర్ధారణ అయింది. కేవలం పాకిస్థాన్ లో మాత్రమే కాదు.. జ్యోతి పలుమార్లు పాకిస్థాన్ లో పర్యటించింది, ఓసారి చైనా కూడా వెళ్లొచ్చినట్టు పోలీసులు వెల్లడించారు.
దేశానికి సంబంధించిన సున్నితమైన విషయాలు పాకిస్తాన్‌కు చేరవేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ పై నెటిజన్లకు ఫోకస్ పెరిగింది. ఇందులో బాగంగా వీడియోస్ లో ఈ తెలుగు పాట వెలుగుచూసింది. పరాయిదేశంలో అందులోనూ పాకిస్థాన్ లో ఆలయంలో ఘంటసాల పాట వినిపించడం తెలుగువారిని ఆనందంలో ముంచెత్తుతోంది. దేశాలు వేరైనా సంగీతానికి సరిహద్దులు లేవని నిరూపించే వీడియో ఇది.
కాళేశ్వరంలో 12 ప్రత్యేకతలు.. సరస్వతి పుష్కరాలకు వెళ్లేవారు ఇవి మిస్సవకండి