JEE Advanced Result 2025 Direct Link Here | ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాయి. లక్షలాది ఇంజినీరింగ్ ఆశావహులకు అప్‌డేట్ వచ్చింది. JEE అడ్వాన్స్డ్ 2025 ఫలితాలను అధికారులు విడుదల చేశాయి. పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డును jeeadv.ac.in వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. అదే విధంగా ఫైనల్ ఆన్సర్ కీ కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్

ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను IIT కాన్పూర్ నిర్వహించింది. ఈ ఏడాది JEE అడ్వాన్స్డ్ పరీక్షకు 1,90,000 మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. రెండు పేపర్లలో అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ జరిగింది. పేపర్-1, పేపర్-2, రెండూ 180 మార్కుల చొప్పున మొత్తం 360 మార్కులకు పరీక్ష నిర్వహించారు.

మే 18న పరీక్ష

JEE అడ్వాన్స్డ్ 2025 పరీక్ష మే 18న దేశవ్యాప్తంగా 224 పరీక్ష కేంద్రాలలో రెండు షిఫ్ట్లలో నిర్వహించారు. ప్రత్యేకత ఏమిటంటే, భారతదేశంతో పాటు ఖాఠ్మాండు, దుబాయ్ వంటి విదేశీ పరీక్షా కేంద్రాలలో ఎగ్జామ్ నిర్వహించారు.  IIT కాన్పూర్ ఈ ఏడాది ఈ పరీక్షను నిర్వహించింది. IIT కాన్పూర్ ఫలితాలతో పాటు టాపర్ల ర్యాంక్ జాబితాను విడుదల చేసింది. ఈసారి రజిత్ గుప్తా దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.

ఈ విద్యార్థులు టాప్ 10లో 

ఈ సంవత్సరం JEE అడ్వాన్స్‌డ్‌లో టాప్ 10లో చోటు దక్కించుకున్న విద్యార్థులలో రజిత్ గుప్తా మొదటి స్థానంలో నిలిచాడు. సాక్షం జిందాల్ రెండో ర్యాంక్,  మాజిద్ ముజాహిద్ హుస్సేన్ 3వ ర్యాంక్, పార్థ్ మందర్ వర్తక్ 4వ, ఉజ్వల్ కేసరి ఐదవ ర్యాంకు సాధించారు. అక్షత్ కుమార్ చౌరాసియా, సాహిల్ ముఖేష్ దేవ్, దేవేష్ పంకజ్ భయ్యా, అర్నాబ్ సింగ్, వడ్లమూడి లోకేష్ టాప్ 10 లో ఉన్నారు.

ర్యాంక్ నిర్ణయించే పద్ధతి

JEE అడ్వాన్స్‌డ్‌లో విద్యార్థులు పొందిన మొత్తం మార్కుల ఆధారంగా ర్యాంక్ జాబితా రూపొందిస్తారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఒకే మార్కులు కలిగి ఉంటే, వారి మధ్య టై-బ్రేక్ విధానం వర్తిస్తుంది. ఇందులో, గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రంలో మెరుగైన స్కోరు సాధించిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.

కేటగిరీల వారీగా టాపర్ల జాబితా

ఓపెన్ కేటగిరీలో వేద్ లహోటి 355 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. అతను IIT ఢిల్లీ జోన్. GEN-EWSలో రాఘవ్ శర్మ, OBC-NCLలో మచ్చా బాలాదిత్య, SCలో బిబాస్వాన్ విశ్వాస్, STలో సుముఖ్ MG టాపర్లుగా నిలిచారు. దివ్యాంగ్ విభాగంలో, చుంచికళ శ్రీచరణ్ CRL-PwD కింద, GEN-EWS-PwDలో గుండా జోష్మిత, OBC-NCL-PwDలో పార్థ్ బవాంకులే, SC-PwDలో హేమంత్ గాడ్వే, ST-PwDలో సంగ్యే నార్ఫెల్ షెర్పా నెంబర్ వన్‌గా నిలిచారు.

పురుషుల విభాగంలో వేద్ లహోటి (355 మార్కులు, IIT ఢిల్లీ) AIR-1 సాధించగా, మహిళా విభాగంలో ద్విజా ధర్మేష్‌కుమార్ పటేల్ (360 మార్కులు, IIT బాంబే) అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఆమె దేశవ్యాప్తంగా అమ్మాయిలలో టాపర్‌గా నిలవగా.. ఆల్ ఇండియా ర్యాంక్-7ను సాధించింది.

జోన్ వారీగా ప్రదర్శన

IIT బాంబే జోన్ నుండి ద్విజా పటేల్, IIT కాన్పూర్ నుండి శ్రేష్ఠా గుప్తా, IIT ఢిల్లీ నుండి అరిత్రా మల్హోత్రా, IIT గువహతి నుండి అర్చిత బంకా, IIT మద్రాస్ నుండి శ్రీనిత్య దేవరాజ్,  IIT భువనేశ్వర్ నుండి తమన్నా కుమారి మంచి ప్రతిభ కనబరిచారు.

JoSAA కౌన్సెలింగ్ జూన్ 3 న ప్రారంభం

ఫలితాల తర్వాత, JoSAA కౌన్సెలింగ్ 2025 ప్రక్రియ ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు, 32 NITలు, 26 IIITలు, 47 GFTI సంస్థలలో విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయి. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతుంది. జూన్ 3 నుంచి జూలై 28 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.

కౌన్సెలింగ్‌లో విద్యార్థులు జూన్ 3 నుంచి జూన్ 12 సాయంత్రం 5 గంటల వరకు JoSAA వెబ్‌సైట్‌ను సందర్శించి నమోదు చేసుకోవాలి. వారికి నచ్చిన కళాశాలలు,  బ్రాంచ్‌లను ఎంచుకోవాలి. అనంతరం మొదటి రౌండ్ సీటు కేటాయింపు జాబితా జూన్ 14న విడుదల చేస్తారు. సీట్లు లభించిన విద్యార్థులు జూన్ 19 లోపు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేసి సీటుకు సంబంధించి ఫీజు చెల్లించాలి.

ప్రతి వారం కొత్త రౌండ్

2వ రౌండ్: జూన్ 21

3వ రౌండ్: జూన్ 28

4వ రౌండ్: జూలై 4

5వ రౌండ్: జూలై 10

6వ మరియు చివరి రౌండ్: జూలై 16

బాలికలకు 20% రిజర్వేషన్

ఈ ఏడాది ఒక ప్రత్యేక చర్య తీసుకున్నారు. IITలతో పాటు NITలలో బాలికలకు 20% అదనపు సీట్లు కేటాయించారు. దాంతో బాలికలకు టాప్ ఇంజినీరింగ్ సంస్థలలో ఎక్కువ అవకాశాలు లభించనున్నాయి. ఈ సీట్ల వల్ల సాధారణ లేదా రిజర్వ్డ్ సీట్లలో ఎలాంటి తగ్గింపు ఉండదు.

ఫలితాలను ఎలా చెక్ చేయాలి

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in సందర్శించండి.
  • ‘JEE అడ్వాన్స్డ్ ఫలితాలు 2025’ లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ రోల్ నంబర్, పుట్టిన తేదీ మరియు మొబైల్ నంబర్ నమోదు చేయండి.
  • సబ్మిట్ చేస్తే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసి భవిష్యత్తు కోసం సేవ్ చేసుకోండి.

Direct Link