12 Special Things in Kaleshwaram: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం. శ్రీ కాళేశ్వర- ముక్తీశ్వర స్వామి కొలువైన ఈ క్షేత్రంలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసా? సరస్వతి నది పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో భక్తుల సందడి భారీగా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటూ వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పుష్కరస్నానం ఆచరించేందుకు వస్తున్నారు. మరిక్కడ ప్రత్యేకలు ఏంటో తెలుసా?
త్రిలింగ క్షేత్రం
కాళేశ్వరం, శ్రీశైలం , ద్రాక్షారామం ఈ 3 క్షేత్రాలను కలిపి త్రిలింగ క్షేత్రం అని పిలుస్తారు దక్షిణ కాశి
కాళేశ్వరం ప్రముఖ పుణ్యశ్రేత్రంగా, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందింది
సరస్వతీ నది అంతర్వాహిని
దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరంలో అంతర్వాహినిగా ప్రవహిస్తోంది సరస్వతి నది.
సరస్వతి పుష్కరాలు
పన్నెండేళ్లకోసారి నదులకు పుష్కరాలు జరుగుతాయి. 2025లో బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా సరస్వతి నదికి పుష్కరాలు వచ్చాయి. కాళేశ్వర క్షేత్రంలో పుష్కరస్నానాలు చేసే భక్తులతో సందడిగా ఉందిప్పుడు
ద్విలింగం
ఏ ఆలయంలో అయినా గర్భగుడిలో ఓ శివలింగం ఉంటుంది. కాళేశ్వర ఆలయంలో ఇందుకు భిన్నంగా ఒకే పానవట్టంపై యముడు, శివుడు కొలువై ఉంటాయి. దేశంలో ఇలాంటి ప్రత్యేకత ఉన్న ఆలయం దేశంలో ఇదొక్కటే. త్రివేణి సంగమం
ఉత్తర భారతదేశంలో ప్రయాగ్‌రాజ్ వద్ద త్రివేణి సంగమం ఎలా ఉందో..కాళేశ్వరం వద్ద కూడా గోదావరి, ప్రాణహితతో పాటూ సరస్వతి నది ప్రవహసిస్తోంది. ప్రయాగరాజ్ తర్వాత ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న ప్రదేశం ఇదే.
నాలుగు ద్వారాలు
ఏ ఆలయంలో అయినా గర్భగుడికి ఓ ద్వారమే ఉంటుంది కానీ కాళేశ్వరాలయంలో గర్భగుడి 4 ద్వారాలు కలిగి ఉంటాయి.
నాలుగు నంది విగ్రహాలు
కాళేశ్వర ఆలయంలో నాగులు రాజగోపురాలు మాత్రమే కాదు నాలుగు నంది విగ్రహాలుంటాయి. ప్రతి రాజగోపురం వద్ద ఓ నంది విగ్రహం ఉంటుంది నాలుగు ధ్వజస్తంభాలు
కాళేశ్వరంలో ఆలయానికి నాలుగు రాజగోపురాలకు, నాలుగు నందివిగ్రహాలతో పాటూ.. నాలుగు ధ్వజ స్తంభాలు ఉన్నాయి
ఐదు నదులు
కాళేశ్వరంలో త్రివేణి సంగమం అంటారు..అయితే వాస్తవానికి ఇది 5 నదులు కలిసే ప్రదేశం. ఎందుకంటే వార్ధా, వైన్ గంగ ఉపనదులుగా ప్రాణహితలో కలుస్తాయి..అలా మూడు నదులు కలిసిన ప్రాణహిత కాళేశ్వరం వద్ద గోదావరి లో కలుస్తుంది. అలా వ్రాథా, వైన్ గంగ, కాళేశ్వరం, గోదావరి, సరస్వతి..మొత్తం ఐదు నదుల కలయిక ఈ ప్రదేశం షణ్ముఖుడు
కాళేశ్వరంలో ఆరు ముఖాలున్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అత్యంత ప్రత్యేకం. కార్తికేయుడికి ప్రీతికరమైన మంగళవారం రోజు ఇక్కడ రాహుకేతు పూజలు జరుగుతాయి
శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం
కాళేశ్వర క్షేత్రం ఏకంగా శివుడికే అంకితం అయిన ఆలయం
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి