Pakistan Spys: భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ కు ఇస్తున్న భారతీయ యూట్యూబర్ తో పాటు మరో ఐదుగుర్ని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన యూట్యూబర్ పేరు జ్యోతి మల్హోత్రా.  పాకిస్తాన్ లో ఉన్న వారికి   సున్నితమైన సమాచారాన్ని ఎవరికీ అనుమానం రాకుంటా చేరవేస్తున్నారు. ఈ కేసులో జ్యోతి మల్హోత్రా  ట్రావెల్ బ్లాగర్‌తో  పని చేస్తున్నారు. ఈమె మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడి  హర్యానా, పంజాబ్ నుంచి  ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారు.

 "ట్రావెల్ విత్ జో" అనే యూట్యూబ్ ఛానెల్‌ను   జ్యోతి మల్హోత్రా నడుపుతున్నారు. గతంలో ఆమె పాకిస్తాన్ పర్యటనకు వెళ్లారు.  కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొందిన   ఆమె 2023లో పాకిస్తాన్‌ను సందర్శించారు.  న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌ ఉద్యోగి   ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో జ్యోతి మల్హోతా పరిచయాలు పెంచుకుంది. 

డానిష్‌ను ప్రభుత్వం ఇటీవేల  పర్సనాలిటీ నాన్ గ్రాటాగా ప్రకటించి, మే 13, 2025న బహిష్కరించింది. డానిష్ గురించి వివరాలన్నీ బయటకు లాగడంతో  జ్యోతి గురించి వెలుగులోకి వచ్చింది.   పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లకు (PIOలు) డానిష్.. జ్యోతి మల్హోత్రాను పరిచయం చేశాడు. .  వాట్సాప్, టెలిగ్రామ్ ,  స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్ట్ చేసిన ప్లాట్‌ఫామ్‌లలో భారత్ కు చెందిన కీలక సమాచారం పాకిస్తాన్ కు పంపేది.  "జాట్ రంధావా" అని సేవ్ చేసుకున్న ఓ పేరు  షకీర్ అలియాస్ రాణా షాబాజ్‌ అనే పాకిస్తాన్ వ్యక్తిది. ఆ వ్యక్తికి రహస్య సమాచారం పంపేవారు. 

ఆమె భారతీయ సైన్యానికి సంబంధించిన  సున్నితమైన సమాచారాన్ని పాక్ ఏజెంట్ కు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.  ఆమె ఒక పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌ సన్నిహితంగా ఉంటోందని..  అతనితో కలిసి ఇండోనేషియాలోని బాలికి కూడా వెళ్లి వచ్చిందని గుర్తించారు. 

జ్యోతిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 152 , అధికారిక రహస్యాల చట్టం, 1923లోని సెక్షన్ 3, 4 మరియు 5 కింద అభియోగాలు నమోదు చేశారు.  తాను తప్పు చేశానని జ్యోతి మల్హోత్రా అంగీకరించారు.  

జ్యోతితో పాటు, మరో కీలక నిందితురాలు పంజాబ్‌లోని మాలెర్‌కోట్లాకు చెందిన 32 ఏళ్ల గుజాలా. ఫిబ్రవరి 27, 2025న, వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి గుజాలా న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌ను సందర్శించారు.   అక్కడ, ఆమె డానిష్‌ను కలిసింది . అప్పటి నుంచి డానిష్ ఆమెతో క్రమం తప్పకుండా మాట్లాడేవాడు.  టెలిగ్రామ్ యాప్ లో చాట్ చేసేవారు.  

 డానిష్ గుజాలాకు డబ్బు పంపడం ప్రారంభించాడు - మార్చి 7న  , ఫోన్‌పే ద్వారా రూ. 10,000 ,  మార్చి 23న  గూగుల్ పే ద్వారా రూ. 20,000 పంపాడు.   ఏప్రిల్ 23న మరో మహిళ భాను నస్రీనాతో కలిసి పాక్ హైకమిషన్ కు వెళ్లింది. డానిష్ తర్వాత రోజే వారికి వీసాలు మంజూరు అయ్యేలా చేశాడు.  

ఈ కేసులో అరెస్టయిన ఇతరులలో మలేర్‌కోట్లాకు చెందిన యమీన్ మొహమ్మద్ కూడా ఉన్నారు.   హర్యానాలోని కైతాల్‌కు చెందిన దేవిందర్ సింగ్ ధిల్లాన్ కూడా అరెస్టు అయ్యారు.   పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ సూచనల మేరకు  డిఫెన్స్ ఎక్స్‌పో 2025ని సందర్శించి ఆ వివరాలను పాకిస్తాన్ ఇంటలిజెస్ ఆపరేటివ్ కు పంపారు.  హర్యానాలోని నుహ్‌కు చెందిన అర్మాన్ కూడా ఇదే పని చేశారు. 

ఈ కేసు ఒక పెద్ద గూఢచర్య ఆపరేషన్‌లో భాగమని పోలీసులు ప్రకటించారు.  మతపరమైన బలహీన వ్యక్తులను భావోద్వేగ సంబంధాలు, డబ్బు బహుమతులు ,  నకిలీ పెళ్లి వాగ్దానాల ద్వారా మోసగించారని అధికారులు  గుర్తించారు. నిందితులు తాము చేసిన నేరాన్ని అంగీకరించారని పోలీసులు ప్రకటించారు.