NTR Prashanth Neel Movie Update: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆయన బర్త్ డే రోజున వచ్చే భారీ మూవీస్ అప్ డేట్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఎన్టీఆర్ - నీల్ మూవీ నుంచి అప్‌డేట్ ఉండదంటూ ప్రకటించింది.
ఇది 'వార్ 2' టైం
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ (Prashanth Neel) అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన బర్త్ డే రోజున ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే టీం ప్రకటించింది. అదే సమయంలో 'వార్ 2' నుంచి అప్ డేట్ ఇస్తున్నట్లు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తెలిపారు. ఈ క్రమంలో తాజాగా.. ఎన్టీఆర్ నీల్ మూవీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ పోస్ట్ పెట్టింది.
'ఇది పూర్తిగా వార్ 2 (War 2) టైం.. మేం ఈ సినిమాను గౌరవిస్తున్నాం. మన మారణహోమాన్ని ప్రారంభించే ముందు.. 'వార్ 2'ను సెలబ్రేట్ చేసుకుందాం. మన మాస్ మిస్సైల్‌ను సరైన టైంలో రిలీజ్ చేద్దాం. ఈ పుట్టిన రోజును 'వార్ 2'తో చేసుకోండి.' అంటూ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి పోస్ట్ పెట్టింది. దీంతో ఆ రోజున ప్రశాంత్ నీల్ మూవీ నుంచి అప్ డేట్ లేదని స్పష్టమవుతోంది.
నిరాశలో ఫ్యాన్స్
ఈ ప్రకటనతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకే రోజు అటు ఎన్టీఆర్ నీల్ మూవీ, ఇటు 'వార్ 2' నుంచి రెండు సర్‌ప్రైజెస్ వస్తున్నాయంటూ సంబరపడగా వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఎన్టీఆర్ నీల్ మూవీ తెరకెక్కనుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్, టీ సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. వచ్చే ఏడాది జూన్ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
'వార్ 2' నుంచి గ్లింప్స్?
ఎన్టీఆర్ బర్త్ డే (మే 20) రోజున 'వార్ 2' నుంచి స్పెషల్ అప్ డేట్ రానుందని ఇప్పటికే హృతిక్ రోషన్ ప్రకటించారు. ఈ సర్ ప్రైజ్ కోసం తాను కూడా ఎదురుచూస్తున్నానని.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఎన్టీఆర్ సైతం ప్రకటించారు. హృతిక్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా 'వార్ 2' రూపొందుతోంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీని యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ బర్త్ డే రోజున గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.