Dadasaheb Phalke Grand Son About Biopic: దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్.. గత రెండు రోజులుగా అటు సోషల్ మీడియా, ఇటు సినీ ఇండస్ట్రీలో ఈ ప్రాజెక్ట్ గురించే చర్చ సాగుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి సమర్పణలో మూడేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్ రాగా.. తాజాగా ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటిస్తారనే వార్తలు హల్చల్ చేశాయి. ఇదే టైంలో బాలీవుడ్ లెజెండ్ ఆమిర్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ కాంబోలో ఈ బయోపిక్ రూపొందనున్నట్లు ప్రచారం సాగింది.

24 గంటల్లోనే..

రాజమౌళి (Rajamouli) సమర్పణలో ఆయన తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా నిర్మాతలుగా నితిన్ కక్కర్ ఈ బయోపిక్ రూపొందించనున్నట్లు వార్తలు హల్చల్ చేశాయి. టీం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ను సంప్రదించగా.. ఆయన తాజాగా ఓకే చెప్పారనే టాక్ వినిపించింది. దాదాసాహెబ్ ఫాల్కేగా ఎన్టీఆర్ ఫోటోలు సైతం వైరల్‌గా మారాయి. ఈ వార్తలు వచ్చిన 24 గంటల్లోనే ఆమిర్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ కాంబోలో ఈ బయోపిక్ తెరకెక్కనుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి.

క్లారిటీ వచ్చేసిందిగా.. 

ఈ ప్రాజెక్ట్‌ను ఓ వైపు ఎన్టీఆర్ (NTR).. మరోవైపు ఆమిర్ ఖాన్ (Aamir Khan) చేస్తున్నారనే వార్తలు పోటాపోటీగా హల్చల్ చేయగా.. ఎవరిది ముందు వస్తుందోననే కన్ఫ్యూజన్ నెలకొంది. దీనిపై తాజాగా దాదాసాహెబ్ మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ స్పందించారు. తనను రాజమౌళి టీం సంప్రదించలేదని.. ఆమిర్ ఖాన్ టీం ఎన్నోసార్లు సంప్రదించారని క్లారిటీ ఇచ్చారు.

Also Read: రజనీకాంత్ ‘2.ఓ’, బాలయ్య ‘లారీ డ్రైవర్’ TO వెంకీ ‘చంటి’, మహేష్ ‘ఖలేజా’ వరకు - ఈ శనివారం (మే 17) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..

మూడేళ్లుగా టచ్‌లో ఉన్నారు

ఆమిర్ - రాజ్ కుమార్ హిరాణీ టీం తమతో ఎన్నోసార్లు చర్చలు జరిపారని దాదాసాహెబ్ మనవడు చంద్రశేఖర్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ రాజమౌళి సమర్పణలో రానున్నట్లు వస్తోన్న వార్తలను తానూ విన్నానని.. ఆయన కానీ, ఆయన టీం కానీ ఇప్పటివరకూ తనతో మాట్లాడలేదని చెప్పారు. 'ఫాల్కేపై ఎవరైనా సినిమా తీయాలంటే కనీసం కుటుంబసభ్యులతోనైనా మాట్లాడాలి. ఎందుకంటే ఆయన గురించి మాకే ఎక్కువ తెలుస్తుంది. ఆమిర్ ఖాన్ టీం అసిస్టెంట్ ప్రొడ్యూసర్ నాతో మూడేళ్లు టచ్‌లో ఉన్నారు. ఎన్నోసార్లు కలిసి వివరాలు తెలుసుకున్నారు.

వాళ్లు ఈ బయోపిక్ రూపొందించడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ ప్రాజెక్టుపై నిజాయతీగా పని చేస్తున్నారు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దాదాసాహెబ్ ఫాల్కేగా నిబద్ధత కలిగిన ఆమిర్ నటించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.' అని అన్నారు. ఈ మూవీలో దాదాసాహెబ్ ఫాల్కే భార్య సరస్వతిబాయ్ ఫాల్కే రోల్‌కు విద్యాబాలన్‌ను తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

అక్టోబర్‌లో షూటింగ్

రాజమౌళి సమర్పణలో ఎన్టీఆర్ ఈ బయోపిక్‌లో నటించనున్నారనే వార్తలు వచ్చిన కొద్ది సేపటికే బాలీవుడ్ మీడియాలో ఆమిర్ ఖాన్ ప్రాజెక్టుపై కథనాలు వచ్చాయి. గత నాలుగేళ్లుగా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని.. 'సితారే జమీన్ పర్' రిలీజ్ అయిన వెంటనే ఫాల్కే బయోపిక్ కోసం ఆమిర్ సిద్ధం కానున్నారని.. అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభం అవుతుందని బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.