NTR About Hrithik Roshan Surprise On War 2 Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ బాలీవుడ్ ఎంట్రీ అవెయిటెడ్ మూవీ 'వార్ 2'. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా..
ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా 'వార్ 2' (War 2) మూవీ నుంచి స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఇప్పటికే ప్రకటించారు. అయితే.. ఆ రోజు మూవీలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌తో టీజర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంతా భావిస్తున్నారు. అదేంటి అనేది తెలియాలంటే ఎన్టీఆర్ బర్త్ డే వరకూ ఆగాల్సిందే.
తాజాగా.. హృతిక్ సర్ ప్రైజ్‌పై ఎన్టీఆర్ స్పందించారు. దీని కోసం తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అలాగే.. 'కబీర్.. నిన్ను వేటాడి నీకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నా.' అంటూ రాసుకొచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతుండగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ - 'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్!
'వార్ 2' సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మూవీలో ఎన్టీఆర్ 'రా' (RAW) ఏజెంట్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఏజెంట్ పాత్రలన్నింటి కంటే ఆయన రోల్ డిఫరెంట్‌గా ఉండనున్నట్లు సమాచారం. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ మూవీ 'వార్'. ఈ స్పై త్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.
ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'వార్ 2' తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లపై ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందని తెలుస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు, 500 మంది డ్యాన్సర్లతో భారీగా ఈ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తుండగా.. బాస్కో మార్టిస్ ఈ పాటకు కొరియాగ్రాఫర్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ పాట మూవీకే హైలెట్‌గా ఉండనుందని మేకర్స్ అంటున్నారు. బాలీవుడ్‌లోనూ ఎన్టీఆర్ హిట్ కొట్టాలని ఆయన ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
అదే రోజున ఎన్టీఆర్ నీల్ మూవీ గ్లింప్స్
ఇక అదే రోజున ఎన్టీఆర్ (NTR), ప్రశాంత్ నీల్ కాంబో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' (ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రానుంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే మూవీ టీం ప్రకటించింది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, టీ సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన 'సప్త సాగరాలు దాటి' ఫేం రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రవి బ్రసూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.