Pawan Kalyan's Hari Hara Veera Mallu New Release Date: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వచ్చేసింది. అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. వివిధ కారణాలతో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆ రోజునే థియేటర్లలోకి
ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. 'జీవితకాలపు యుద్ధానికి సిద్ధంగా ఉండండి. ధర్మం కోసం యుద్ధం ప్రారంభమవుతుంది. జూన్ 12న హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) రిలీజ్ కానుంది.' అంటూ ఓ కొత్త పోస్టర్‌ను మూవీ టీం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. తొలుత ఈ సినిమా మార్చి 28న రిలీజ్ చేయాలని భావించారు. అయితే, పవన్ బిజీగా ఉండడంతో షూటింగ్ ఆలస్యమై వాయిదా పడింది.
ఆ తర్వాత మే 9న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. పవన్ కల్యాణ్‌కు సంబంధించి షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. ఇంతలో రిమెయినింగ్ వర్క్ పూర్తి చేశారు. రీరికార్డింగ్, డబ్బింగ్ పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ మూవీ షూటింగ్‌లో పాల్గొనగా చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఏఎం రత్నం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. త్వరలోనే ట్రైలర్, అదిరిపోయే సాంగ్స్ వస్తాయని చెప్పారు. అనుకున్న విధంగానే మూవీ రిలీజ్‌పై అప్ డేట్ ఇచ్చారు.
Also Read: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచరస్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో పవన్ ఇదివరకు ఎన్నడూ కనిపించని పవర్ ఫుల్ డిఫరెంట్ రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రెండు పార్టులుగా ఈ మూవీ తెరకెక్కిస్తుండగా.. ఫస్ట్ పార్ట్‌ను 'హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీని సగానికి పైగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. అనివార్య కారణాలతో ఆయన డైరెక్షన్ బాధ్యతల నుంచి వైదొలిగారు. దీంతో మిగిలిన భాగాన్ని నిర్మాత ఎ.ఎం.రత్నం కుమారుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు. రెండో పార్ట్ కూడా ఆయనే డైరెక్ట్ చేయనున్నారు.
పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.దయాకర్‌రావు మూవీని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజా పాలనలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ కావడంతో భారీ హైప్ నెలకొంది. మూవీ రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్‌తో మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.