భార్య, అత్త, ఆమె కుమార్తెలు పెడుతున్న వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఫేస్ బుక్ లైవ్ పెట్టి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లాలోని మదనపల్లె పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది. గుంటూరుకు చెందిన శంకర్ నారాయణ కుమారుడు ఉదయ్ భాస్కర్(45) కొంతకాలం క్రితం మదనపల్లెకు వచ్చి ఇక్కడే శేషామహల్ ఏరియాలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. 


Also Read: Nellore News: పోలీస్ స్టేషన్ లో ప్రేమ పంచాయితీ... తల్లిదండ్రులకు కౌన్సెలింగ్... కానీ


Also Read: Hyderabad News: మణికొండలో డ్రైనేజీలో పడి గల్లంతైన యువకుడు... 48 గంటల తర్వాత మృతదేహం లభ్యం...


ఉదయ్ భాస్కర్ కు ఆరేళ్ల క్రితం మదనపల్లెకు చెందిన సోనీతో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. ఉదయ్ భాస్కర్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. కుటుంబ విషయమై తరచూ గొడవలు పడేవారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి భర్త ఉదయ్ భాస్కర్ కి సోనీ మధ్య గొడవ తలెత్తింది. భర్తతో గొడవపడిన సోనీ మదనపల్లెలోని పుట్టింటికి వెళ్లింది.  సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఉదయ భాస్కర్ తన భార్య, ఆమె తల్లి, భార్య చెల్లెల్లు పెడుతున్న ఇబ్బందులు తట్టుకోలేక ఫేస్ బుక్ లైవ్ పెట్టి.. ఆత్మహత్య చేసుకున్నాడు. 


Also Read: Illegal Activities: 20 మంది పురుషులు.. ముగ్గురు మహిళలతో.. లారీలు అడ్డుగా పెట్టి ఘోరం, బహిరంగంగానే..


Also Read: Crime News: 8 నెలలుగా గ్యాంగ్ రేప్.. శిశువుకు జన్మనిచ్చిన బాలిక.. బిడ్డను ఏం చేశారంటే..


ఫేస్ బుక్ లో ఈ విషయాన్ని గుర్తించిన కొంతమంది స్నేహితులు బాధితుడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు.. కుటుంబ సభ్యులతో కలిసి స్నేహితులు ఇంటి వద్దకు చేరుకునే సమయానికే ఉదయ్ భాస్కర్ మృతి చేందాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసిన మృతిదేహాన్ని శవ పరిక్షల నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యానికి బానిసై ఉదయ్ భాస్కర్ తరచూ వేధింపులకు గురి చేసే వాడని, ఈ కారణంగా పలుమార్లు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. చేశానని, ఆదివారం కూడా గొడవ పెట్టుకొని కొట్టడంతో తాను పుట్టింటికి వెళ్లి నట్లు మృతుడి భార్య సోనీ అంటోంది.


Also Read: Abortion: యూట్యూబ్‌లో చూస్తూ సొంతగా అబార్షన్ చేసుకున్న రేప్ బాధితురాలు, ప్రియుడి సలహాతోనే.. చివరికి..


Also Read: Fake Currency Printing: యూట్యూబ్ చూసి దొంగనోట్ల ప్రింటింగ్.. చికెన్ పకోడితో సీక్రెట్ బయటకి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి