పోలీసుల అత్సుత్సాహం ఓ గర్భిణీకి ప్రాణాల మీదకు తెచ్చింది. వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు పెండింగ్ చలాన్లు ఉన్నాయని డెలివరి కోసం వెళ్తోన్న మహిళ కారుకు ఆపేశారు. 40 నిమిషాలు పాటు కారును రహదరిపైనే నిలిపివేశారు. ఆ మహిళ వేధనను సైతం పట్టించుకోకుండా కారును నిలిపివేశారన్నారు. మెదక్ జిల్లా అల్లదుర్గంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 


Also Read:  పోలీస్ స్టేషన్ లో ప్రేమ పంచాయితీ... తల్లిదండ్రులకు కౌన్సెలింగ్... కానీ


చలాను చెల్లించాలని పట్టుబట్టిన పోలీసులు


మెదక్ జిల్లా నారాయణఖేడ్ చెందిన శిల్ప అనే మహిళకు నెలలు నిండి డెలివరి కోసం ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు కుటుంబసభ్యులు. నారాయణఖేడ్ నుంచి మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తరలిస్తున్నారు. మార్గ మధ్యలో అల్లదుర్గం వద్ద పోలీసులు వాహనా తనిఖీలు చేపట్టారు. వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని పోలీసులు కారు డ్రైవర్‌కు తెలిపారు. తన వద్ద నగదు లేదని ఆన్లైన్ పేమెంట్ చేస్తానని డ్రైవర్‌తో పాటు గర్భిణీ కుటుంబ సభ్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. డబ్బులు కడితేనే వదులుతామని కారును నిలిపివేశారు. 


Also Read: క్రికెట్ బెట్టింగ్ కు యువకుడు బలి... నెల్లూరు జిల్లాలో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య


ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా...!


దీంతో గర్భిణీ కుటుంబసభ్యులు చలాన్లు చెల్లించేందుకు అంగీకరించారు. అయితే నెట్‌వర్క్ ఇష్యూతో చలాను చెల్లింపు కోసం దాదాపు 40 నిమిషాల ఆగాల్సివచ్చింది. అప్పటి వరకూ రహదారిపైనే ఆ కారును పోలీసులు నిలిపివేశారు. గర్భిణీ అయిన శిల్ప వేధనతో తల్లడిల్లుతున్నా పోలీసులు కరగలేదు. ఈ 40 నిమిషాల్లో మహిళకు ఏమైనా జరగరానిది జరిగి ఉంటే పరిస్థితి ఏమిటంటూ కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ రిపోర్టుల కోసం పోలీసులు అడగలేదని, గర్భిణీ బంధువులు కూడా చూపలేదని డ్రైవర్ తెలిపారు. చివరికి 40 నిమిషాలు తర్వాత కూడా నెట్‌వర్క్ ప్రాబ్లమ్ పరిష్కారం కాకపోవడంతో పోలీసులు వాహనాన్ని వదిలిపెట్టారు. అల్లదుర్గం పోలీసుల తీరును చూసి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటూ మండిపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించాల్సి ఉంది. 


Also Read: యూట్యూబ్ లో ఆత్మహత్య వీడియో చూసి బాలిక బలవన్మరణం... తల్లికి ముందే ఆ వీడియో చూపించిన చిన్నారి... బంధువులు మరో ఆరోపణ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి