రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ పోసాని కృష్ణమురళి ఘాటు వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ప్రెస్ మీట్ ను నిర్వహించి పవన్ పై కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో చిరంజీవిని అతడి ఫ్యామిలీను తన స్పీచ్ లోకి లాగారు పోసాని కృష్ణమురళి. చిరంజీవి గారు పార్టీ పెట్టిన కొత్తలో అవినీతి గురించి మాట్లాడుతున్నారని.. అతడి పరువు తీయాలని టీడీపీ నాయకులు అనుకున్నారని పోసాని అన్నారు. ఆ సమయంలో చిరంజీవి కూతురు గురించి.. ఇంట్లో ఆడవాళ్ల గురించి లైవ్ లో ఘోరంగా మాట్లాడారని.. ఆ విషయం తెలుసుకున్న చిరంజీవి అన్నం కూడా తినకుండా క్యారవాన్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నారని పోసాని చెప్పారు.
Also Read: ప్రెస్ క్లబ్ వద్ద పోసానిపై దాడికి పవన్ ఫ్యాన్స్ ప్రయత్నం..పోలీసు రక్షణతో తరలింపు !
ఆ సమయంలో చిరు పక్కనే ఉన్న కన్నబాబు తనకు ఫోన్ చేసి విషయం చెప్పారని.. వెంటనే చిరు ఫోన్ తీసుకొని.. ''పోసాని.. రాజకీయాలకు, నా భార్యాబిడ్డలకు ఏం సంబంధం'' అంటూ వాపోయారని పోసాని గుర్తుచేసుకున్నారు. వెంటనే ప్రెస్‌మీట్‌పెట్టి కేశినేని నానిపై ప్రశ్నల వర్షం కురిపించానని పోసాని అన్నారు. అప్పుడు చిరంజీవి కొందరు సన్నిహితులతో 'పోసాని నా గుండెల్లో ఉన్నారు' అని అన్నారట. ఆ విషయాన్ని శ్రీకాంత్ తనతో చెప్పాడని పోసాని చెప్పుకొచ్చారు. 'ఆరోజు మీ అన్నయ్య కుటుంబాన్ని అంత అవమానిస్తుంటే నువ్ ఎక్కడ దాక్కున్నావ్' అంటూ పవన్ ని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు పోసాని. మీరు, మీ ఫ్యాన్స్ సైకోలు. ఇతర హీరోల ఫంక్షన్‌లకు వెళ్లి 'పవన్.. పవర్‌స్టార్' అని అరుస్తుంటారని..అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్ లో కూడా అలానే చేశారని.. అప్పుడు అతడు నా సినిమా ఈవెంట్ లో పవన్ గురించి మాట్లాడను అంటే పెద్ద గొడవ చేశారని అన్నారు.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిన్నటినుంచి తనకు వేల సంఖ్యలో ఫోన్లు, మెసేజ్ లు చేస్తున్నారని.. బూతులు తిడుతూ మెసేజ్ లు చేస్తున్నారని చెప్పారు. అభిమానులను అడ్డుపెట్టుకొని పవన్ నియంతలా వ్యవహరిస్తున్నారని.. అతడిని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అభిమానులతో దాడులు చేయిస్తున్నారని అన్నారు.
Also Read: అవకాశాల పేరుతో అమ్మాయిని మోసం చేస్తే.. మీరేం చేశారు..? పవన్ పై పోసాని వ్యాఖ్యలు
Also Read : రాత్రి పది గంటలకు పవన్ ఫోన్.. తిట్టేశా.. పోసాని వ్యాఖ్యలు..
Also Read:ట్రెండింగ్ లో #JusticeforPunjabiGirl
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి