Indian Army: ఉరీ సెక్టార్‌లో ప్రత్యేక ఆపరేషన్.. 7 రోజుల్లో ఏడుగురు ఉగ్రవాదులు ఔట్

ABP Desam Updated at: 28 Sep 2021 05:05 PM (IST)
Edited By: Murali Krishna

దేశంలోకి చొరబడాలని ప్రయత్నించిన ఓ ఉగ్రవాదిని సైన్యం హతమార్చింది. మరొక ఉగ్రవాదిని అరెస్టు చేసింది.

భారత ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్

NEXT PREV

జమ్ముకశ్మీర్ ఉరీ సెక్టార్‌లో సైన్యం జరిపిన ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఉగ్రవాది లొంగిపోయాడు. దేశంలోకి చొరబడాలని వీరు చేసిన ప్రయత్నాలను భారత సైన్యం అడ్డుకుంది. 



లష్కరే తొయిబాకు చెందిన అలీ బాబర్ పాత్రా అనే ఉగ్రవాది భద్రతా దళాల ముందు లొంగిపోయాడు. పాకిస్థాన్‌ పంజాబ్‌లోని ఒఖారా ప్రాంతానికి చెందిన అలీ బాబర్‌ను జమ్ముకశ్మీర్ ఉరీ సెక్టార్‌లో అదుపులోకి తీసుకున్నారు.                                                - భారత ఆర్మీ










సాల్మాబాద్‌ నాలా ప్రాంతం​లోని సరిహద్దు గుండా భారత్​లోకి వచ్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారని అధికారులు తెలిపారు. చొరబాటును సైన్యం విజయవంతంగా అడ్డుకుందని పేర్కొన్నారు. 



ఈ చొరబాటుదారులకు కచ్చితంగా పాకిస్థాన్ ఆర్మీ మద్దతు ఉంది. ఆయుధాలను సరఫరా చేసేందుకు నియంత్రణ రేఖ గుండా వారికి పాక్‌కు చెందిన ముగ్గురు కూలీలు సాయం చేశారు. ఇంత పెద్ద ఎత్తున చొరబాటుదారుల ముఠా సరిహద్దుకు ఆవలి వైపున ఉంది అంటే పాక్ ఆర్మీ సాయం లేకుండా అసాధ్యం. గత ఏడురోజుల్లో 7 ఉగ్రవాదులు హతమయ్యారు. ఒకర్ని అదుపులోకి తీసుకున్నాం. -                                       భారత సైన్యం


మరో ఆపరేషన్..


మరోవైపు పుల్వామా జిల్లాలో పోలీసులు, జవాన్లు కలిసి ఉగ్రవాద శిబిరం గుట్టురట్టు చేశారు. ఇద్దరు ఉగ్ర అనుచరులను అరెస్టు చేశారు. నిఘా వర్గాల సమచారం మేరకు ఉగ్రవాదులు తలదాచుకునే శిబిరాన్ని బలగాలు గుర్తించాయి. అయితే తనిఖీ చేసిన సమయంలో అందులో ఉగ్రవాదులు ఎవరూ లేరని పోలీసులు వెల్లడించారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి సైతం లభించలేదని చెప్పారు.


Also Read:Navjot Singh Sidhu Resign: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా.. అమరీందర్ సింగ్ కౌంటర్!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 28 Sep 2021 04:57 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.