పంజాబ్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. అంతా సద్దుకుంది అనుకున్న సమయానికి పీసీసీ చీఫ్ పదవికి నవజోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. తన రాజీనామాను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సమర్పించారు.
పంజాబ్ భవిష్యత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సిద్ధూ ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని సిద్ధూ స్పష్టం చేశారు.
నేను అప్పుడే చెప్పా..
సిద్ధూ రాజీనామాపై పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. నవజోత్ సింగ్ సిద్ధూ స్థిరత్వం లేని మనిషని తాను ఎప్పుడో చెప్పినట్లు అమరీందర్ ట్వీట్ చేశారు. సిద్ధూ.. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌కు సరిపోరని అమరీందర్ ఆరోపించారు.
భాజపాలోకి అమరీందర్..
మరోవైపు అమరీందర్ సింగ్ దిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు సాయంత్రం అమరీందర్ భేటీ అవుతారన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మరి అమరీందర్ భాజపాలోకి వెళ్తారా లేదో చూడాలి.
అయితే 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా, కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రమాణస్వీకారం.. తాజాగా పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా చేయడం వంటి పరిణామాలు పంజాబ్ రాజకీయాలను మరింత వేడెక్కించాయి.
Also Read:New York Times Cover Page: విపరీతంగా వైరల్ అయిన ఆ 'న్యూయార్క్ టైమ్స్' న్యూస్ క్లిప్ ఫేక్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి