పవన్ కల్యాణ్ అభిమానులు తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన ప్రెస్‌మీట్ పెట్టి పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ అభిమానిగా ఆయనను విమర్శిస్తే తాను స్పందిస్తానని అంత మాత్రాన కుటుంబసభ్యులను ఇందులోకి తీసుకొచ్చి విమర్శిస్తారా అని ఆయన ప్రశ్నించారు. తన భార్యంటే తనకు ప్రాణమని..ఆమె చనిపోయిన రోజే తాను చనిపోతానని ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు. ఈ ప్రెస్‌మీట్‌లో పవన్ కల్యాణ్ భార్యలపైనా, ఆయన వ్యక్తిగత జీవితంపైనా పోసాని చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో పవన్ తో తనకు గొడవలు ఉన్నాయని అందుకే కోపం పెంచుకున్నారని ఆరోపించారు.
Also Read : రాత్రి పది గంటలకు పవన్ ఫోన్.. తిట్టేశా.. పోసాని వ్యాఖ్యలు..
పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూండటంతో పవన్ కల్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్నారు. ఆయనపై దాడి జరిగే అవకాసం ఉందన్న సమాచారం నేపధ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పోసానికి పవన్ కల్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున ప్రెస్‌క్లబ్ వద్ద గుమికూడి పోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పవన్ కల్యాణ్ గురించి అనుచితంగా మాట్లాడితే అంచు చూస్తామని హెచ్చరించారు. పోలీసులు పలువుర్ని అక్కడిక్కడ అరెస్ట్ చేసి తరలించారు. అయినా మరి కొంతమంది గుమికూడటంతో పోసానిని సొంతకారులో వెళ్లేందుకు పోలీసులు అంగీకరించలేదు.
Also Read: అవకాశాల పేరుతో అమ్మాయిని మోసం చేస్తే.. మీరేం చేశారు..? పవన్ పై పోసాని వ్యాఖ్యలు
ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడటం పూర్తయిన తర్వాత పోలీసులు పోసానికి బయట పరిస్థితిని వివరించి కాసేపు లోపలే ఉంచారు. తర్వాత ఆయన కారులో వెళ్లడం సేఫ్ కాదని భావించి పోలీసులు తమ కారులోనే ఇంటి దగ్గర దిగబెట్టాలని నిర్ణయించారు. ఆయనకు భద్రత కల్పించి క్షేమంగా కారులో కూర్చుబెట్టి ఇంటి వైపు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి .. తనకు ఏమైనా అయితే పవన్ కల్యాణ్‌దే బాధ్యత అని ప్రకటించారు. తాను పవన్ కల్యాణ్‌పై కేసు పెడతానని హెచ్చరించారు.
రిపబ్లిక్ మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శలు చేసిన వ్యవహారంపై పోసాని ఘాటుగా స్పందించడంతో సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. సోమవారం వ్యక్తిగత విమర్శలు చేయడంతో పవన్ ఫ్యాన్స్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. అయితే ఫ్యాన్స్‌తో పవన్ కల్యాణే అనిపిస్తున్నారంటూ ఆయన ఈ రోజు మళ్లీ తీవ్ర ఆరోపణలు చేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. పోసాని ఇంటి వద్ద కూడా పోలీసులు భద్రత కల్పించినట్లుగా తెలుస్తోంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి