Posani Krishnamurali: రాత్రి పది గంటలకు పవన్ ఫోన్.. తిట్టేశా.. పోసాని వ్యాఖ్యలు.. 

'రిపబ్లిక్' సినిమా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.

Continues below advertisement

'రిపబ్లిక్' సినిమా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి మండిపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన ప్రెస్ మీట్ ను నిర్వహించి పవన్ ప్రవర్తన గురించి మాట్లాడారు. ఆరోగ్యం బాగాలేక పోసాని ఉదయాన్నే షూటింగ్ కి వెళ్లి సాయంత్రంలోపు వర్క్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేవారట. అదే సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా ఆఫర్ వస్తే.. ఉదయం వచ్చి సాయంత్రానికి వెళ్లిపోతానని పోసాని చెప్పారట. దానికి అంగీకరించడంతో పోసాని షూటింగ్ లో పాల్గొన్నారట. 

Continues below advertisement

Also Read: అవకాశాల పేరుతో అమ్మాయిని మోసం చేస్తే.. మీరేం చేశారు..? పవన్ పై పోసాని వ్యాఖ్యలు

కానీ ఒకరోజు సాయంత్రం వరకు పని చేసిన తరువాత శంషాబాద్ లొకేషన్ కి రావాలని పిలిచారట. పెద్ద హీరో కావడంతో పోసాని నో చెప్పలేక.. ఏడు గంటలకు షూటింగ్ స్పాట్ కి వెళ్తే.. ఎంతసేపటికీ పవన్ కళ్యాణ్ రాలేదట. 9గంటల వరకు ఎదురుచూసి.. మేనేజర్ కి చెప్పి వెళ్లిపోయారట పోసాని. ఆ తరువాత రాత్రి 10 గంటలకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి.. ''ఏవండీ మేం పిచ్చోళ్లమా.. ఎలా వెళ్తారు చెప్పకుండా.. ఏం అనుకుంటున్నారు సినిమా అంటే''.. అంటూ పోసానిని తిట్టగా.. 'ఆగవయ్యా ఆగు.. నువ్ పదింటికి వస్తే నేను రావాలా.. నువ్ ఒంటిగంటకు వస్తే నేను రావాలా.. నువ్వేమైనా సుప్రీం అనుకుంటున్నావా..? నేను కూడా ఆర్టిస్ట్ ని. నేను వచ్చా.. నువ్ లేవు.. నువ్ రాజకీయాల్లో పనులు చూసుకొని వస్తే నేను వెయిట్ చేయాలా..? బానిసల్లాగా..? నా హెల్త్ బాలేదు.. నేను ఉండను'' అని పోసాని బదులిచ్చారట. 

'సార్ నాకు ఇలా చెప్పలేదు వీళ్లు' అని పవన్ అనగా.. 'ఇప్పుడు తెలుసుకున్నావ్ కదా.. నాకింక ఫోన్ చేయకు' అని పోసాని ఫోన్ పెట్టేశారట. సెట్ లో ఉన్నవారందరికీ విషయం తెలిసిపోయిందని.. అలానే పావు గంటసేపు కూర్చున్న పవన్ కళ్యాణ్ మ్యానేజర్ ని పిలిచి.. 'ఇక రేపటి నుంచి మనకి పోసాని లేరు' అని చెప్పి కంటిన్యూ చేయమన్నారట. పోసాని టైమింగ్స్ గురించి చెప్పలేదని.. కో డైరెక్టర్ ని స్పాట్ లోనే తీశేశారట పవన్ కళ్యాణ్. ఈ విషయాలను పోసాని తన లేటెస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. తన మీద పవన్ కళ్యాణ్ కి పీకలవరకు కోపం ఉందని చెప్పారు పోసాని.  

 

Also Read: దర్శకుడు పూరీ జగన్నాథ్ కి మైండ్ బ్లోయింగ్ విషెష్ చెప్పిన అభిమాని

Also Read: బన్నీ- లెక్కల మాస్టారు తగ్గేదే లే అన్నారు...ఇప్పుడు తగ్గక తప్పడం లేదా...మరోవైపు 80 మిలియన్ వ్యూస్ కి చేరిన 'పుష్ప' సింగిల్ సాంగ్

Also Read: హ్యాపీ బర్త్ డే ఇస్మార్ట్ పూరీ , మందు గ్లాసుతో దర్శకుడికి బర్త్ డే విషెష్ చెప్పిన బ్యూటీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola