ఏనుగుల ప్రవర్తన ఏ సమయంలో ఎలా ఉంటుందో ఊహించలేం. కొద్ది రోజుల క్రితం ఓ గుడి వద్ద ఏనుగు మావటివాడు ఎక్కిన తర్వాత గందరగోళం చేసింది. అటూ ఇటూ పరిగెడుతూ భక్తులను భయభ్రాంతులకు గురి చేసింది. ఈ క్రమంలో ఆ మావటివాడు కింద పడిపోయాడు. దీప స్తంభం కూడా విరిగిపోయింది.


Also Read: 14 ఏళ్ల కుర్రోడు... రైల్వేస్టేషన్ ఎదురుగా దహీ కచోరీ అమ్ముతున్నాడు... వీడియో వైరల్... పెరిగిన అమ్మకాలు






తాజాగా ఓ ఏనుగు ఆర్టీసీ బస్సుపై దాడి చేసింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఏనుగు బస్సుపై దాడి చేసే వీడియోను IAS సుప్రియ సాహు తన ట్విటర్ ద్వారా నెటిజన్లతో పంచుకోవడంతో ఇది కాస్త వైరలైంది. అసలేం జరిగిందంటే... తమిళనాడులోని నీల్‌గిరీస్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు వెళ్తుండగా... ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఏనుగు హఠాత్తుగా వచ్చి బస్సు ఎదురుగా నిల్చుంది. అనంతరం ఆ ఏనుగు దంతాలతో డ్రైవర్ ముందున్న అద్దంపై దాడి చేసింది. ఆ తర్వాత మరో పక్క అద్దంపై కూడా దాడి చేసింది. డ్రైవర్ రివర్స్ గేర్ వేసి దాడికి దూరంగా జరిగాడు. కానీ, ఏనుగు ఊరుకోలేదు. ఈ క్రమంలో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత డ్రైవర్ తనపై నుంచి దృష్టి మళ్లించేందుకు తన సీటులో నుంచి లేచి వెనక్కి వెళ్లిపోయాడు. ఈ వీడియోను తమిళనాడు Principal Secretary of Environment Climate Change & Forest అధికారి సుప్రియ సాహు ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 






Also Read: స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ లిఫ్ట్స్ వాడొద్దు... మెట్లు ఎక్కి రండి... ఓ మాల్ ఆర్డర్... నెటిజన్ల ఆగ్రహం


డ్రైవర్ ఎంతో కూల్‌గా వ్యవహరించాడు. అందుకే ప్రయాణికులంతా జాగ్రత్తగా తిరిగి ఇళ్లకి వెళ్లారు అని ఆమె పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నిజంగా ఇలాంటి ఘటనే ఎదురైతే... ఏం చేయాలి? అని ప్రశ్నించారు. చాలా మంది నెటిజన్లు చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.