ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ స్కూళ్ల స్వాధీన ప్రక్రియ కీలక మలుపు తిరిగింది. ఎయిడెడ్ పాఠశాలలను బలవంతంగా స్వాధీనం చేసుకోవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో స్వచ్చందంగా ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వానికి అప్పగించకపోతే సాయం నిలిపివేయబోమని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. ఈ అంశాన్ని హైకోర్టు రికార్డు చేుకుంది. ఎయిడెడ్ స్కూళ్లను బలవంతంగా స్వాధీనం చేసుకోవద్దని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు తక్షణం ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. 


Also Read : డ్రగ్స్ పోయి బూతులు వచ్చే ఢాం..ఢాం..ఢాం ! రాజకీయం అంతా డైవర్షన్ పాలిటిక్సేనా ?


ఆగస్టు మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యాచట్టం-1982ను సవరిస్తూ ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్‌ తెచ్చింది.  ఇందులో ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ప్రభుత్వ గ్రాంటును నిలుపుదల చేయడం, తగ్గించడం, ఉపసంహరించడానికి ప్రభుత్వానికి అధికారం కల్పించారు. అలాంటి నిర్ణయం తీసుకునేముందు సదరు విద్యాసంస్థ అన్ని నియమాలను పాటించిందా? సంస్థ ఆర్థిక పరిస్థితి ఏమిటి? తదితర అంశాలపై రెండునెలల్లో విచారణ పూర్తిచేయాలి. ఏవైనా నిబంధనల ఉల్లంఘనలుంటే వాటిపై మేనేజరు విజ్ఞప్తి చేసుకోవచ్చు.  విచారణ పెండింగ్‌లో ఉంటే కూడా గ్రాంటును తాత్కాలికంగా నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి కల్పించారు. ఈ మేరకు గవర్నర్‌ ఆమోదించిన ఆర్డినెన్స్‌ను జారీ చేశారు . 


Also Read : వైఎస్ఆర్‌సీపీలో చేరేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నం ! అప్పుడేం జరిగిందంటే ?


ఈ ఆర్డినెన్స్ ఆధారంగా ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలను ప్రభుత్వానికి అప్పగించాలని లేకపోతే సిబ్బందిని వెనక్కి తీసుకుని ఎయిడ్ ఆపేస్తామని ప్రభుత్వం  హెచ్చరికలు ప్రారంభించింది. అయితే ఎయిడెడ్ స్కూళ్లకు పెద్ద ఎత్తున భూములు ఉండటంతో ఆ భూమలపై కన్నేసే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. అదే సమయంలో అనేక మంది ఎయిడెడ్ స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వానికి స్వాధీనం చేసేందుకు అంగీకరించలేదు. దాంతో సిబ్బందిని వెనక్కితీసుకున్నారు. ఎయిడ్ నిలిపివేసే ప్రయత్నం చేయడంతో విజయవాడలోని మాంటిస్సోరి వంటి స్కూళ్లు మూతపడ్డాయి. 


Also Read : 'అన్నీ కుదిరితే ఎమ్మెల్యే అవుతా'.. ఆనందయ్య పొలిటికల్ ఎంట్రీ.. పార్టీ పెడతారా?


కడప జిల్లాలతో పాటు మరికొన్ని చోట్ల ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. దీంతో ఆయా కళాశాల యాజమాన్యాలు ఆంధ్రప్రదేశ్‌లో విద్యా చట్టం నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గత విచారణలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు  పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వాడ్రేవు చిన వీరభద్రుడు కోర్టుకు హాజరయ్యారు.  స్కూల్స్‌కు ఎయిడ్ నిలిపివేస్తామని ప్రభుత్వం బెదిరించలేదని..ఇంకా అటువంటి నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు చెప్పారు.  బలవంతంగా పాఠశాలలు స్వాధీనం చేసుకుంటామని అనలేదని, ఎయిడ్ నిలిపివేస్తామని చెప్పలేదని వివరణ ఇచ్చారు. ఆయన స్టేట్‌మెంట్‌ను న్యాయస్థానం రికార్డు చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 4కు వాయిదా వేసింది.


Also Read: Budvel By Election : బద్వేలు బరిలో బీజేపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థి ! పోటీకి ఎవరు ముందుకు వస్తారు ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి