లంచాలు తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా నేరమని మన చట్టాలు చెబుతూంటాయి. అదే పనిగా ప్రచారం కూడా చేస్తూంటారు. కానీ ఎక్కడా లంచాలు ఇవ్వడం.. తీసుకోవడం అనేవి అగడం లేదు. ఎందుకంటే ఈ చట్టాలు చేసిన ప్రజా ప్రతినిధులే వాటిని పట్టించుకోవద్దని నేరుగా చెబుతూ ఉంటారు కాబట్టి. మధ్యప్రదేశ్‌లో బహుజన సమాజ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు లంచాలు ఎలాపద్దతిగా తీసుకోవాలో ప్రభుత్వ ఉద్యోగులకు పాఠాలు చెబుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


Also Read : కాంగ్రెస్ గూటికి చేరిన కన్హయ్య కుమార్, జిగ్నేశ్ మేవానీ


మధ్యప్రదేశ్‌లో బీఎస్పీకి రాంబాయి సింగ్ అనే ఎమ్మెల్యే ఉన్నారు. ఆమె నియోజకవర్గంలో ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ గ్రామస్తులంతా కలిసి ఆమెకు అధికారులు లంచాల కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద తమకు ఇళ్లు మంజూరు చేయడానికి పంచాయతీ సిబ్బంది లంచం తీసుకొన్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.  దీంతో అటు గ్రామస్తులు.. ఇటు అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. 


Also Read:Navjot Singh Sidhu Resign: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా.. అమరీందర్ సింగ్ కౌంటర్!


గ్రామస్తులు ఎవరెవరు ఎంతెంత లంచం ఇచ్చారు.. ఎవరెవరికి ఇచ్చారో చెప్పాలని హుకుం జారీ చేశారు. గ్రామస్తులు ఎవరికైతే లంచం ఇచ్చారో వారి వైపు చూపిస్తూ ఎంత ఎంత ఇచ్చారో చెప్పారు. గ్రామస్తులే కాదు ఇతరులు కూడా ఏమనుకుంటారు ...  లంచంగా తీసుకున్న సొమ్ము తిరిగి ఇప్పించేసి వారిపై  చర్యలు తీసుకుంటారని అనుకుంటారు. కానీ ఆమె మాత్రం వెంటనే వారికి లంచాల పాఠాలు చెప్పడం ప్రారంభించారు. 


 BSP MLA Rambai Singh : “It is alright to indulge in corruption equivalent to the amount of salt added in flour, but you should not snatch the entire plate from someone.”#BahujanSamaj #Mayawati pic.twitter.com/OgXI5MDbn3





Also Read : చీకట్లో చైనా.. పరిశ్రమలకు చిక్కులు.. ఇక ప్రపంచానికి చుక్కలు!


లంచం తీసుకోండి. కానీ...దానికో పద్దతి ఉంటుంది. పిండిలో ఉప్పు మాదిరిగా లంచం తీసుకోవాలి కానీ ఇష్టం వచ్చినట్లుగా తీసుకోకూడదు. గ్రామస్థులు అందరి దగ్గరా ఒకేలా తీసుకోలేదు. అందరూ చిన్నాచితకా పనులు చేసుకొనేవాళ్లే.. అందుకే కొంత ఉంచుకుని మిగతా ఇచ్చేయండి అని ఆదేశించారు.  లంచాల విషయంలో ఆమె పంచాయతీ అందరికీ నచ్చింది. కొంతమంది మాత్రం ఇంకా నయం తనకు కూడా వాటా ఇవ్వాలని అడగలేదని సెటైర్లు వేసుకున్నారు . మరికొందరు మాత్రం లంచాలు తీసుకోకుండా ఆపలేరు కాబట్టి పేదల్ని పీడించకుండా ఆమె మంచి ఫార్ములా చెప్పారని అంటున్నారు.  మొత్తానికి ఈ లంచాల పంచాయతీ వీడియోల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


Also Read : వీడెవడెండి ..బాబూ ! మద్యం మత్తులో తన కోసం వెదుక్కున్న మందుబాబు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి