" ఎమ్మెస్ నారాయణ బార్ నుంచి బయటకు వస్తాడు. ఆటో ఎక్కుతాడు. ఎక్కడకు వెళ్లాలో చెబుతాడు. ఆటో బయలుదేరడానికి టర్న్ తీసుకుని ఆగుతుంది. వెంటనే ఆటో దిగిపోయే .. ఇంత వేగంగా తీసుకొచ్చేశావ్ అని డ్రైవర్‌ని అభినందించి డబ్బులిచ్చి మళ్లీ బార్‌లోకి వెళ్లిపోతాడు.." ఇది ఓ సినిమాలో హిట్ కామెడీ సీన్.  ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడతాడు " రాత్రి పార్టీలో బాగా తాగాను అయినా స్టడీగా ఉన్నాను. కానీ రెస్పాన్సిబుల్ సిటిజన్‌గా క్యాబ్ మాట్లాడుకుని వెళ్లాను " అని ఆ పోస్ట్ సారాంశం. అందరూ అభినందిస్తారు. కానీ ఒక మిత్రుడు మాత్రం " మీ ఇంట్లోనే కదా పార్టీ జరిగింది క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కడికి వెళ్లావ్ " అనే సందేహాన్ని కామెంట్ రూపంలో పెడతారు. అతను ఎక్కడికి వెళ్లాడో వెదుక్కోవడం తర్వాత పని. 


Also Read : పేరెంట్స్‌తో వస్తేనే బర్గర్ షాపులోకి అనుమతిస్తాం... 18 సంవత్సరాలలోపు వారికి బర్గర్ షాప్ ఆర్డర్


ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెబుతున్నామంటే... ఇవి జోకులు మాత్రమే కాదు.. ఇలాంటి వాళ్లు ఉంటారని చెప్పడానికి. టర్కీలో ఓ వ్యక్తి మద్యం సేవించి కనిపించకుండా పోయాడు. ఆతని కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు. ఎంత వెదికినా కనిపించలేదు. ఎందుకంటే... అలా వెదికిన బృందంలో ఆ వ్యక్తి కూడా ఉన్నాడు. వాళ్లతో పాటే తన కోసం తను వెదికాడన్నమాట. ఈ విచిత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. 


Also Read : పాక్ కోర్టులో బంట్రోతు ఉద్యోగానికి 15 లక్షల దరఖాస్తులు!


టర్కీకి చెందిన బెహాన్ అనే వ్యక్తి స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్నాడు. తర్వాత అతను అడవిలోకి వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. దాంతో అతని స్నేహితుల్లో ఆందోళన పెరిగిపోయింది. వెతికి.. వెతికి ఇక లాభం లేదనుకుని.. ఆలస్యమైతే మిత్రుడు అన్యాయమైపోతాడని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు పలు బృందాలు ఏర్పాటు చేసి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. వారికి స్థానికులు కూడా కొంత మంది సహకరించారు. 


Also Read : ఈ చాక్లెట్లలో రక్తాన్ని కలుపుతారు.. ఎందుకో తెలుసా?


తీవ్ర గాలింపు తర్వాత ఇక లాభం లేదనుకుని మైక్ సెట్లలో పిలవడం ప్రారంభించారు. బుహాన్ ఎక్కడున్నా శబ్దం చేయి రక్షిస్తాం అని అరవడం ప్రారంభించారు. అలా అరుస్తున్న ఓ గుంపులో బుహాన్ కూడా ఉన్నాడు. మెల్లగా తానే బుహాన్‌ను అని చెప్పడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. నిజానికి ఎవరి కోసం వెదుకుతున్నారో బుహాన్‌కు కూడా తెలియదు. తను తప్పిపోయానని ఆయన అనుకోలేదు. తన స్నేహితులు తను తప్పిపోయానని పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలియదు. తన కోసం వెదుకుతున్నారని అనుకోలేదు. అందుకే తన కోసం జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో తను కూడా పొల్గొన్నాడు. చివరికి విషయం తెలుసుకుని సీరియస్ అయిన సెర్చ్ టీమ్స్.. తర్వాత నవ్వుకుని బుహాన్‌ను ఇంటివద్ద వదిలి పెట్టాయి. తాగుబోతుల వల్ల అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా హైలెట్ అవుతూనే ఉంటాయి. 


Also Read : విపరీతంగా వైరల్ అయిన ఆ 'ది న్యూయార్క్ టైమ్స్' న్యూస్ క్లిప్ ఫేక్!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి