టీఎస్ఆర్డీసీ బస్సుల రంగులు మార్చే ఆలోచనలో ఉన్నారు. మెుదట ప్రయోగాత్మకంగా సిటీ బస్సుల రంగు మారనుంది. నష్టాలతో ఉన్ ఆర్టీసీని గాడిన పెట్టెందుకు ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే అందులో భాగంగానే.. బస్సులు చూడగానే ఆకట్టుకునేలా కనిపించాలని టీఎస్ఆర్టీసీ అనుకుంటోంది. 


టీఎస్ఆర్టీసీ బస్సులు చాలా ఏళ్లుగా ఒకే రంగు ఉంది. పాతబడ్డ ఈ బస్సులకు కొత్త లుక్ తీసుకురావాలని ఆర్టీసీ భావిస్తోంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ.. జనాలను ఆకర్శించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే రంగులు మార్చడం ద్వారా కొంత ఫలితాన్ని పొందొచ్చని అధికారులు భావిస్తున్నారు.  


అప్పట్లో నగరంలో ఆకుపచ్చ, పెసర రంగులతో సిటీ బస్సులు ఉండేవన్న విషయం తెలిసిందే.  దినేశ్‌రెడ్డి ఆర్టీసీ ఎండీగా ఉన్న సమయంలో బస్సుల రంగులు మార్చారు. అప్పటి వరకు ఎర్ర బస్సు అన్న పేరుతో ఆర్టీసీ ఆర్డినరీ బస్సులు ప్రత్యేకంగా గుర్తింపు పొందాయి. పల్లెలు పచ్చదనంతో మెరిసిపోయే తరుణంలో, బస్సులు కూడా దాన్ని ప్రతిబింబించేలా ఉండాలన్న ఉద్దేశంతో రంగులు మార్చారు. అందుకే పల్లెవెలుగు బస్సులు ఆకుపచ్చ రంగుతో ఉంటున్నాయి. చాలా ఏళ్లుగా ఇదే రంగు చూసి జనాలకు బోర్ కొట్టి ఉంటుందన్న ఆలోచన వచ్చింది. అందుకోసమే జనాన్ని ఆకట్టుకునేందుకు రంగులు మార్చాలని చూస్తున్నారు.  తెలుపు రంగు ఆకర్షిస్తుందన్న ఉద్దేశంతో తెలుపుతో కలిపి ఇతర రంగు వేయించాలన్న ఆలోచన ఉంది. మరోవైపు గతంలో ఆకట్టుకున్న ఆకుపచ్చ–పెసరి రంగును కూడా పరిశీలిస్తున్నారు. అలా కొన్ని రంగులు చూసి.. ఆకర్శించే రంగును ఎంపిక చేస్తారు.


బస్సు డ్రైవర్లకు సజ్జనార్ హెచ్చరిక


తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్టీసీలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి.  తాజాగా బస్సు డ్రైవర్లను హెచ్చరించారు సజ్జనార్. ఆర్టీసీ బస్సులను రోడ్డు మధ్యలో ఆపి ప్రయాణికులను ఎక్కించుకుంటూ ప్రమాదాలకు కారణమవుతున్నట్టు వస్తున్న ఫిర్యాదులపై సజ్జనార్ స్పందించారు. ఇకపై రోడ్డు మధ్యలో బస్సులను ఆపొద్దని ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్డు మధ్యలో బస్సులను ఆపడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమని, ట్రాఫిక్ పోలీసులు కనుక ఫైన్ వేస్తే ఆ మొత్తాన్ని సంబంధిత డ్రైవర్లే భరించాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూల్స్ ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


Also Read: Jagan ED Case: జగతి పబ్లికేషన్స్‌ ఈడీ ఛార్జ్‌షీట్‌పై విచారణ వాయిదా.. పెన్నా కేసులో డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేసిన సీఎం జగన్, విజయసాయిరెడ్డి