నిన్నటి( మంగళవారం)తో పోల్చుకుంటే ఈ రోజు (బుధవారం) బంగారం ధర తగ్గింది. హైదరాబాద్‌ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130.  అటు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అయితే దీపావళి నాటికి భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఈ రోజు ఉదయం ఆరు గంటల వరకూ ఉన్న ధరలు పరిశీలిస్తే  


దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,040
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,300
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200, 24 క్యారెట్ల ధర రూ.47,130


వెండి ధరలు:  వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి.   దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.60,100 ఉండగా, చెన్నైలో రూ.64,700 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.60,100,  కోల్‌కతాలో రూ.60,100 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.61,100, కేరళలో రూ.64,700 ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.64,700 ఉంది.


అయితే బంగారం, వెండి ధరల్లో  నిత్యం స్వల్ప హెచ్చుతగ్గులున్నా దిపావళి నాటికి బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఏకంగా పది గ్రాముల బంగారం  రూ.57 వేల నుంచి రూ.60 వేల వరకు చేరుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న రేట్లపై దాదాపు పదివేలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. వెండి ధరలు కూడా బంగారం ధరలనే ఫాలో అవుతాయంటున్నారు.


వివిధ అంశాలపై పసిడి ధర
బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.


Also Read: ఈ రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు,ఈ ఐదు రాశులవారికి అద్భుతంగా ఉంటుంది, ఏ రాశుల వారికి ఎలా ఉందంటే..


Also Read:పోలీసుల కళ్లుగప్పి ఏపీ నుంచి యూపీకి భారీ స్మగ్లింగ్.. 972 కేజీల గంజాయి సీజ్, ముగ్గురు నిందితుల అరెస్ట్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి