ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఓ స్క్రీన్ షాట్.. విపరీతంగా వైరల్ అయింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్.. ఇలా ఒక్కటేంటి అన్ని సోషల్ మీడియాల్లోనూ ఇదే పోస్ట్ దర్శనమిచ్చింది. ఆ పోస్ట్ ఏంటి? అసలు దాని కథేంటి? చూద్దాం..
ఆ పోస్ట్ ఇదే..
అమెరికా ప్రముఖ వార్తాపత్రిక న్యూయార్క్ టైమ్స్ 2021, సెప్టెంబర్ 26న ప్రచురించిన ఎడిషన్‌లో మొదటి పేజీలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను ప్రచురించినట్లు ఆ పోస్టులో ఉంది. ఆ ఫొటోను ఉద్దేశిస్తూ 'LAST, BEST HOPE OF EARTH' అని కోట్ చేసిందని చెప్తూ, ఓ న్యూస్ క్లిప్.. ఫేస్ బుక్‌లో వైరల్ అయింది. ఆ తర్వాత అది ట్విట్టర్, వాట్సాప్‌లో కూడా చక్కర్లు కొట్టింది.
ఈ వైరల్ పోస్ట్‌ను భాజపా యువనేత రోహిత్ చాహల్ కూడా రీట్వీట్ చేశారు. ఆయనకు దాదాపు 76,000 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఆ ట్వీట్‌ను అనంతరం ఆయన డిలీట్ చేశారు.
ఇది ఫేక్..
న్యూయార్క్ టైమ్స్ దినపత్రిక సెప్టెంబర్ 26న ప్రచురించిన ఎడిషన్ మొదటి పేజీలో మోదీకి సంబంధించి ఎలాంటి కథనం రాయలేదు. వైరల్ అవుతున్న న్యూయార్క్ టైమ్స్ క్లిప్ డిజిటల్‌గా తయారు చేశారు. వైరల్ అవుతున్న క్లిప్‌లో తేదీకి సంబంధించిన వివరాలలో సెప్టెంబర్ స్పెల్లింగ్ తప్పుగా ఉంది, పేపర్ ధర, ఎడిషన్ వాల్యూమ్ వివరాలు కూడా తప్పే. కనుక ఇది ఓ ఫేక్ పోస్ట్ అన్నమాట. దీనిని ఎవరో కావాలనే వైరల్ చేశారని తెలుస్తోంది.
Also Read:Navjot Singh Sidhu Resign: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా.. అమరీందర్ సింగ్ కౌంటర్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి