జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో దిల్లీలో వీరిద్దరూ ఆ పార్టీ కండువాను కప్పుకున్నారు. 2022లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో కన్హయ్య, మేవానీ చేరిక కీలకం కానుందని విశ్లేషకులు అంటున్నారు.










హార్దిక్ పటేల్ హర్షం..


కన్హయ్య కుమార్, జిగ్నేశ్ మేవానీ పార్టీలో చేరడంపై గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ హర్షం వ్యక్తం చేశారు. తామంతా అభివృద్ధి గురించి మాట్లాడే నేత కింద పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.


విద్యార్థి నేతగా..



  1. దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా కన్హయ్య కుమారు గతంలో పనిచేశారు.

  2. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ)లో కన్హయ్య కుమార్ చేరారు.

  3. బిహార్‌లోని బెగుసరాయ్ స్థానం నుంచి బీజేపీకి చెందిన గిరిరాజ్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

  4. చివరికి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు కన్హయ్య కుమార్.


ఉద్యమ నేతగా..


రాష్ట్రీయ దళిత అధికార మంచ్ (ఆర్‌డీఏఎమ్) కన్వీనర్‌గా మేవానీ ఉన్నారు. 2017 లో కాంగ్రెస్ మద్దతుతో గుజరాత్‌లోని వడ్గామ్ అసెంబ్లీ స్థానంలో పోటీచేసి గెలిచారు. 


Also Read:Navjot Singh Sidhu Resign: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా.. అమరీందర్ సింగ్ కౌంటర్!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి