హైదరాబాద్‌కు చెందిన జెనెటిక్ టెస్టింగ్, కౌన్సెలింగ్ సంస్థ మ్యాప్‌మైజెనోమ్ (Mapmygenome) ఇండియా, జైమో (Zymo) రీసెర్చ్ సంస్థలు సంయుక్తంగా తెలంగాణ ప్రభుత్వానికి లక్ష కోవిడ్ టెస్ట్ కిట్‌లను విరాళంగా అందించాయి. భారతదేశానికి ఒక మిలియన్ కిట్లు విరాళంగా ఇవ్వాలన్న జైమో రీసెర్చ్ చొరవలో భాగంగా వీటిని విరాళంగా ఇచ్చాయి. మ్యాప్‌మైజెనోమ్ సంస్థ సీఈవో అను ఆచార్య వీటిని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. దేశంలోని ప్రధాన రాష్ట్రాలలో కోవిడ్ టెస్ట్ కిట్ల పంపిణీ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి తమ బృందం పనిచేస్తోందని అను ఆచార్య ఈ సందర్భంగా వెల్లడించారు.
Also Read: Bathukamma 2021: జిల్లాలకు చేరిన బతుకమ్మ చీరలు.. ఈసారి 290 రకాల్లో.. ఇలా పొందొచ్చు
తక్కువ సమయంలోనే కోవిడ్ టెస్ట్ ఫలితం..
కోవిడ్ టెస్ట్ కిట్‌లో కొత్త డీఎన్ఏ/ ఆర్ఎన్ఏ (DNA/RNA) షీల్డ్ – డైరెక్ట్ డిటెక్ట్ రియేజెంట్, సేకరణ పరికరాలు ఉన్నాయని అను ఆచార్య తెలిపారు. ఈ కిట్‌తో నమూనాల సేకరణ, నిర్వహణ ఎంతో సురక్షితమని చెప్పారు. ఈ కిట్ ద్వారా కోవిడ్ టెస్ట్ ఫలితం కూడా చాలా తక్కువ సమయంలోనే వస్తుందని వివరించారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా పరీక్ష, నివారణకు మ్యాప్‌మిజెనోమ్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read: Breaking Updates Live: తెలంగాణ పీజీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..
కోవిడ్ నిర్ధారణ పరీక్షలు మరింత సులభతరం..
కోవిడ్ కేసులు పెరుగుతున్న దేశాల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షల నిర్వహణను డీఎన్‌ఏ/ ఆర్ఎన్ఏ షీల్డ్- డైరెక్ట్ డిటెక్ట్ సులభతరం చేస్తుందని జైమో రీసెర్చ్ బిజినెస్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మార్క్ వాన్ ఈడెన్ వెల్లడించారు. స్వాబ్ సేకరణలో ఎదురయ్యే అడ్డంకులను ఇది తొలగిస్తుందని తెలిపారు. అవసరమైన వారికి మానవీయ సహకారం అందించడం తమ విధానమని చెప్పారు. ఆర్టీపీసీఆర్ పరీక్షను వేగంగా విస్తరించే, సులభతరం చేసే సామర్థ్యం ఉన్నందున మ్యాప్‌మిజెనోమ్‌తో తాము కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు.
Also Read: KRMB: నాగార్జున సాగర్ నీటి విడుదలలో తేడాలు సరిదిద్దండి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ..
Also Read: Vijayashanthi: పంజాబ్ రాష్ట్రంలా తెలంగాణ మారుతోంది.. హైదరాబాద్‌లో మరీ ఎక్కువ.. విజయశాంతి సెటైర్లు