కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఛైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ప్రభుత్వం తరఫున తెలంగాణ ఈ‌ఎన్‌సీ (ఇంజనీర్ ఇన్‌ చీఫ్‌) సి. మురళీధర్ కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాశారు. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల ప్రవాహ సామ‌ర్థ్యాల‌లో ఉన్న అసమతుల్యతను సవరించాలని లేఖలో కోరారు. 1952లో ఆంధ్రా, హైదరాబాద్ రాష్ట్రాల మధ్య కుదిరిన అంతర్ రాష్ట్ర ఒప్పందం ప్రకారం నాగార్జున సాగర్ కుడి కాలువ (ఆంధ్రప్రదేశ్ వైపు), ఎడమ కాలువ (తెలంగాణ వైపు) హెడ్ రెగ్యులేటర్ల విడుదల సామర్థ్యాలు సమానంగా ఉండాలని పేర్కొన్నారు. ఇక నాగార్జున సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ విడుదల సామర్థ్యం నాగార్జున సాగర్ నీటి మట్టం 500 అడుగుల వద్ద 11 వేల క్యూసెక్కులు ఉంటే.. ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ విడుదల సామర్థ్యం నాగార్జున సాగ‌ర్‌లో నీటి మట్టం 520 అడుగుల ఉంటేనే 11 వేల క్యూసెక్కులు వీలవుతుందని తెలిపారు. 


Also Read: Bathukamma 2021: జిల్లాలకు చేరిన బతుకమ్మ చీరలు.. ఈ సారి 290 రకాల్లో.. ఇలా పొందొచ్చు


ఎండీడీఎల్ 510 అడుగుల వద్ద ఎడమ కాలువ విడుదల సామర్థ్యం 7,899 క్యూసెక్కులు ఉండగా, కుడి కాలువ విడుదల సామర్థ్యం 24,606 క్యూసెక్కులుగా ఉందని ఈ‌ఎన్‌సీ తన లేఖలో వివరించారు. ఇది రెండు కాలువల్లో ఉన్న తీవ్రమైన అసమానత అని ప్రస్తావించారు. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల హెడ్ రెగ్యులేటర్ల విడుదల సామర్థ్యాల్లో ఈ అసమానతను సరిదిద్దాలని బోర్డును కోరారు. ఎండీడీఎల్ (MDDL) + 510 అడుగుల వద్ద రెండు కాలువల విడుదల సామర్థ్యం సమానంగా ఉండాలని తెలిపారు. ఏపీ రాష్ట్రానికి, నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు ఇతర మార్గాల ద్వారా సాగు నీటి సరఫరాకు అవకాశం ఉన్నందున వారు కృష్ణా న‌ది నీటిని బేసిన్‌లో ఉన్న తెలంగాణకు వదిలేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్‌ను కోరిందని పేర్కొన్నారు. 


Also Read: Diversion Politics : డ్రగ్స్ పోయి బూతులు వచ్చే ఢాం..ఢాం..ఢాం ! రాజకీయం అంతా డైవర్షన్ పాలిటిక్సేనా ?


Also Read: Breaking Updates Live: ఇకనుంచి భయం అంటే ఏంటో వైసీసీ నేతలకు చూపిస్తా.. మంగళ గిరిలో పవన్ కళ్యాణ్



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి