డ్రై ఫ్రూట్స్ తినాలని ఇటీవల కాలంలో అందరికీ అవగాహన వచ్చింది. రెండు మూడు సంవత్సరాల క్రితం తక్కువ మంది డ్రై ఫ్రూట్స్ తినేవాళ్లు. ఈ కరోనా కారణంగా ఆరోగ్యంపై అవగాహన పెరిగి ప్రతి ఇంట్లో ఉదయం బాదం పప్పులు నానబెట్టుకుని తింటున్నారు. అసలు బాదం పప్పులు ఒకరు ఎన్ని తినాలి? ఎలా తినాలి? అన్న సందేహాలు మాత్రం చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు ఈ సందేహాలన్నింటినీ తీర్చుకుందాం.
Also Read: పరగడుపును గోరు వెచ్చని నీళ్లు తాగితే ఎన్నో లాభాలో... ఆ లాభాలేంటో మీరు తెలుసుకోండి
డ్రై ఫ్రూట్స్ లో బాదం పప్పుది కీలక పాత్ర అని చెప్పవచ్చు. చాలా రకాల అనారోగ్య సమస్యలను తరిమికొట్టడంతోపాటు.. జుట్టు రాలడం లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. మరి బాదం పప్పును ఎలా తినాలన్న దానిపై వైద్యులు ఏమంటున్నారంటే... ఒక కప్పు బాదం పప్పులలో సుమారు 11.5 గ్రాముల కొవ్వు మరియు 5 గ్రాముల ప్రోటీన్లు కలిగి ఉంటాయి. బాదంలో ఉండే కొవ్వు గుండెకు చాల మంచిది. జీర్ణ శక్తిని, చర్మ కాంతిని కూడా పెంచుతాయి. కీళ్ల నొప్పుల సమస్య ను కూడా తగ్గిస్తుంది.
Also Read: మలేరియా, డెంగ్యూ బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలంటే... ఈ చిట్కాలు పాటించండి
లాభాలు ఎక్కువగా ఉన్నాయని ఎక్కువ మొత్తంలో బాదం పప్పులను తీసుకోకూడదు. బాదం పప్పులు తినడం కొత్తగా ప్రారంభించిన వారు రోజుకి కేవలం 4 లేదా 5 బాదం పప్పులు తింటే సరిపోతుంది. ఇక దీనిని ఎలా తినాలి అనే విషయానికి వస్తే.. రాత్రిపూట నీటిలో నానపెట్టి ఉదయాన్నే దాని పొట్టు తీసేసి తినాలి. అలా తింటే.. ఈ బాదంలోని పోషకాలన్నీ మన సొంతమవుతాయి. ఆహార నిపుణుల సూచన ప్రకారం రోజుకు 8 నుంచి 10 బాదం పప్పులు తింటే చాలు. బరువు తగ్గేందుకు, కండలు పెంచేందుకు, జుట్టు బాగా పెరిగేందుకు ఈ మోతాదు సరిపోతుంది. అయితే, బాదంను నేరుగా తినేయకుండా నీటిలో 7 నుంచి 8 గంటలు నానబెట్టి, తొక్క తీసి తినడం మంచిది. నానబెట్టడం వల్ల పోషకాలు వేగంగా శరీరానికి అందుతాయి.
Also Read: ఈ విధంగా పుదీన రసం తీసుకుంటే... లివర్ క్లీన్ అవుతుంది... వ్యర్థాలు పోతాయి
బాదం పప్పులు ప్రెగ్నెన్సీ మహిళలకు చాలా మంచిది. దీని వల్ల కడుపులో పెరిగే బిడ్డకి కూడా అన్ని రకాల పోషక విలువలు పుష్కలంగా అందుతాయి. మన జుట్టుకు కావాల్సిన అన్ని రకాల విటమిన్లూ, పోషకాలూ బాదంలో ఉంటాయి. ముఖ్యంగా జుట్టును ఒత్తుగా, గట్టిగా, బలంగా పెంచే మెగ్నీషియం, జింక్ విటమిన్ E బాదంలలో ఉంటాయి. అలాగే... జుట్టును ఎక్కువ కాలం నిలిచి ఉండేలా చేసే విటమిన్ B బాదంపప్పుల్లో ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి