సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఇంటిపై పలువురు దాడికి యత్నించారు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలోని ఆయన ఇంటిపై రాళ్లతో దాడి చేస్తూ బూతులు తిడుతూ వీరంగం ప్రదర్శించారు. దీంతో వాచ్‌మెన్ సహా కుటుంబ సభ్యులంతా భయపడిపోయారు. ఈ ఘటనపై ఆయన ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దగ్గర్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తిస్తున్నారు. ఇటీవల పోసాని పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితం కూడా పోలీసుల ఎదుటే పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు పోసానిని కాపాడి అక్కడి నుంచి తరలించారు.

Also Read : ‘మా’ వారసుడు మంచు విష్ణు.. తెలుగోళ్లే పోటీ చేయాలి.. ఎవడు పడితే వాడు ఆ సీట్లో కూర్చుంటే..: నరేష్ వ్యాఖ్యలు

అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోసాని ఇంటిపై దుండగులు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. వాచ్ మెన్ భార్య వెల్లడించిన వివరాల ప్రకారం.. నటుడు పోసాని దాడి జరిగిన ఇంట్లో గత 8 నెలలుగా ఉండడం లేదని తెలిపారు. వారు అదే ఇంట్లో ఉండగా దాదాపు 10 ఏళ్లు వంట చేసిపెట్టేదాన్నని, పని కూడా చేసేదాన్నని చెప్పారు. ఆ ఇంటి దగ్గర్లోనే తాము కూడా ఉండడంతో ఇంటి బాధ్యతలు పోసాని తమకు అప్పగించారని చెప్పారు. అప్పటి నుంచి నైట్ వాచ్ మెన్ తరహాలో అక్కడే ఉండేవాళ్లమని చెప్పారు. 

Also Read : టెంట్ హౌస్‌లా పార్టీని కిరాయికి ఇస్తారు.. ఇండస్ట్రీతో పవన్‌కు సంబంధం లేదన్న పేర్ని నాని

రెండు రోజుల క్రితం కూడా రాత్రి వేళ కొంత మంది ఇంటి ముందుకు వచ్చి పోసాని దంపతులను బూతులు తిడుతూ హంగామా చేశారని తెలిపారు. మళ్లీ నిన్న రాత్రి ఏకంగా రాళ్లతో దాడి చేశారని చెప్పారు. దీంతో లోపల ఉన్న తమకు భయం వేసిందని, కొడతారేమోనని బయటకు రాలేదని వాచ్ మెన్ భార్య మీడియాతో అన్నారు. దుండగులు వెళ్లిపోయాక రాళ్లను వీడియో తీశామని, పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వారు సంఘటనా స్థలాన్ని పోసానికి ఫోన్ చేసి విషయం తెలపగా.. ధైర్యంగా ఉండాలని చెప్పినట్లు వివరించారు.

Also Read: ‘అయ్యయ్యో వద్దమ్మా? సుఖీభవ సుఖీభవ’.. ఈ వైరల్ వీడియో కథేందీ? ఎలా పుట్టింది?

Also Read: Pavan Kalyan Alone : "ఇండస్ట్రీ" పవన్‌ను వద్దనుకుందా ? తమ కోసం పోరాడినా ఒంటరిని చేశారా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి