దీపావళి నాటికి బంగారం ధర దాదాపు 60వేలకు చేరుతుందన్న నిపుణలు... రోజురోజుకి స్వల్పంగా తగ్గుతున్న సమయంలో బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం అంటున్నారు నిపుణులు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది.  వెండిది కూడా అదే పరిస్థితి. కిలో వెండి ధర స్వల్పంగా తగ్గింది. దేశంలో ప్రధాన నగరాల్లో ఉదయం ఆరు గంటల వరకూ ఉన్న బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 


దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,040
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,300 
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130 
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200, 24 క్యారెట్ల ధర రూ.47,130


స్వల్పంగా దిగొచ్చిన కిలో వెండి ధర
ఢిల్లీలో కిలో వెండి రూ.60,100
చెన్నైలో కిలో వెండి రూ.64,700
ముంబైలో కిలో వెండి రూ.60,100
కోల్‌కతా,  బెంగళూరులో కిలో వెండి రూ.61,100 
కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి రూ.64,700


దీపావళినాటికి ధర భారీగా పెరిగే అవకాశం: అయితే బంగారం, వెండి ధరల్లో  నిత్యం స్వల్ప హెచ్చుతగ్గులున్నా దిపావళి నాటికి బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఏకంగా పది గ్రాముల బంగారం  రూ.57 వేల నుంచి రూ.60 వేల వరకు చేరుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న రేట్లపై దాదాపు పదివేలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. వెండి ధరలు కూడా బంగారం ధరలనే ఫాలో అవుతాయంటున్నారు.


వివిధ అంశాలపై పసిడి ధర: బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.


Also Read: స్వల్పంగా తగ్గిన ఇంధన ధరలు, ఇక్కడ స్థిరంగా, మీ నగరంలో తాజా ధరలు ఇవే..


Also Read: ఈ నాలుగు రాశులవారికి ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది, మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో చూద్దాం..


Also Read: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి