హైదరాబాద్‌లో ఓ నటి శవం కుళ్లిపోయిన స్థితిలో లభ్యం కావడం కలకలం రేపుతోంది. ఈమె ఒక జూనియర్ ఆర్టిస్ట్ అని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఒక నటి ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పూర్తి వివరాలివీ..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ సమీపంలోని గాజుల రామారం ప్రాంతంలో కావలి అనురాధ అనే 22 ఏళ్ల యువతి నివాసం ఉంటోంది. ఈమె గత మూడు నెలలుగా కిరణ్ అనే యువకుడితో కలిసి ఫిలిం నగర్‌లోని జ్ఞానిజైల్ సింగ్ నగర్‌లో ఉంటోంది. ఓ ఇంటి రెండో అంతస్తులో గదిలో నివసిస్తోంది. అయితే, కొద్ది రోజులుగా ఆమె గది నుంచి బయటికి రావడం లేదని స్థానికులు తెలిపారు. ఇటీవల ఆమె ఉంటున్న గదిలో నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుండడాన్ని స్థానికులు గమనించారు. ఇంటి కింద అద్దెకు ఉండే కొందరు యువకులు ఈ విషయం గమనించి.. మంగళవారం రాత్రి యజమానికి విషయం చెప్పారు. ఆయన అక్కడికి చేరుకొని దుర్వాసనను గమనించి.. బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు.
Also Read: వైఎస్ షర్మిలతో ప్రశాంత్ కిషోర్ బృందం భేటీ.. పాదయాత్రపై చర్చ!
దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఫిలిం నగర్‌లోని జ్ఞానిజైల్ సింగ్ నగర్‌కు చేరుకొని ఇంటిని పరిశీలించారు. అనందరం గదికి లోపలి నుంచి గడియ వేసి ఉండడంతో బలవంతంగా తలుపులు తెరిచి లోనికి వెళ్లారు. గదిలోకి వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యానుకు చీరతో వేలాడుతూ అనురాధ అనే యువతి శవం కనిపించింది. ఆ యువతి శవం కుళ్లిన స్థితిలో కనిపించింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. వారి విచారణలో కిరణ్ అనే యువకుడితో అనురాధ దాదాపు ఆరేళ్లుగా యువతి ప్రేమలో ఉందని అతను పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో.. కొద్ది రోజులుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని పోలీసులు చెప్పారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులే తమకు చెప్పినట్లుగా పోలీసులు వివరించారు.
అయితే, అనురాధకు తెలియకుండా కిరణ్ మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడని ఆమెకు తెలియడంతో నిలదీసినట్లు చెప్పారు. తనకు జరిగిన అన్యాయాన్ని భరించలేక తన సోదరి చనిపోయి ఉంటుందని అనురాధ సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఈ వ్యవహారంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నిందితుడైన కిరణ్ అనే యువకుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Also Read: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం
Also Read: రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి.. దక్షిణ మధ్య రైల్వే వెల్లడి