మొన్నటి వరకు నెటిజనులు ‘బుల్లెట్ బండి’ పాటను అరగదీశారు. తాజాగా ‘సుఖీభవ’ అంటూ చిందులేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అదే పాట.. అదే మాట. ఇంతకీ ఈ ‘సుఖీభవ’ ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టింది? జనాలను అంతగా పిచ్చికేస్తున్న ఈ వీడియోలో ఏముందో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? అయితే.. చూసేయండి మరి. 


వాస్తవానికి ‘సుఖీభవ’ అనేది ఓ టీపొడి ప్రకటనలోని డైలాగు నుంచి పుట్టింది. జోరును కురుస్తున్న వర్షంలో రోడ్డు మీద ఆగి ఉన్న ఓ కారు వద్దకు ఓ హిజ్రా టీ పట్టుకుని వస్తుంది. దీంతో ఆ కారులో ఉన్న పెద్దవిడ.. ఆమె మీద చిరాకు పడుతుంది. ఆమెకు డబ్బులివ్వడానికి చూస్తుంది. ఈ సందర్భంగా ఆ హిజ్రా ‘‘అయ్యయ్యో వద్దమ్మా.. ఈ పక్కనే నా టీ కొట్టు ఉందమ్మ. అందరికీ ఒక కప్పు టీ ఇద్దమనుకున్నాను.. తీసుకోండి అంటూ ఆ పెద్దావిడకు టీ ఇస్తుంది. టీ తాగిన ఆ పెద్దావిడ.. మళ్లీ ఆ హిజ్రాను దగ్గరకు పిలుస్తుంది. ‘‘అయ్యయ్యో వద్దమ్మా.. ఈ రోజు డబ్బులు తీసుకోను’’ అని అంటుంది. ‘‘డబ్బులు ఇవ్వడం లేదులే గానీ.. సుఖీభవ’’ అని ఆ హిజ్రాను ఆశీర్వదిస్తుంది. 


Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!


ఆ ప్రకటనలోని మాటలను.. ఇటీవల వినాయక చవితి ఊరేగింపులో ఓ యువకుడు రీమిక్స్ చేసి వినిపించాడు. ‘‘అయ్యయ్యో వద్దమ్మా.. పక్కనే టీ కొట్టు పెట్టాను. అందరికీ ఒక కప్పు టీ ఇస్తున్నాను. డబ్బులు తీసుకోను కానీ.. సుఖీభవ.. సుఖీభవ’’ అని డప్పు వాద్యాల మధ్య డ్యాన్స్ చేశాడు. అంతే.. అది కాస్తా వైరల్‌గా మారి.. నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. ఇటీవల హైదరాబాద్ పోలీసులు కూడా దీన్ని వాడేసుకున్నారు. సైబర్ నేరాల నుంచి అప్రమత్తం చేస్తూ.. ‘సుఖీభవ’ మీమ్‌ పోస్ట్ చేశారు. అంతేగాక.. ఈ వైరల్ వీడియో మీద ఇప్పుడు ఫన్నీ మీమ్స్ కూడా పుట్టాయి. వాటిని చూస్తే తప్పకుండా నవ్వేస్తారు.