పంజాబ్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన నవజోత్ సింగ్ సిద్ధూతో చర్చలు జరపడానికి అధిష్ఠానం నిర్ణయించింది. ఇందులో భాగంగా సిద్ధూతో.. పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ చర్చలు జరపనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు సిద్ధూ ట్వీట్ చేశారు.
అమరీందర్ భేటీ..
మరోవైపు పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ వరుస భేటీలు అవుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో నిన్న భేటీ అయిన అమరీందర్ సింగ్.. ఈరోజు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో సమావేశమయ్యారు.
అమరీందర్ సింగ్.. భాజపాలో చేరే అవకాశం ఉందని పలు వార్తలు వినిపిస్తున్నాయి. 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభం పార్టీ అధిష్ఠానానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. అయితే అమరీందర్ సింగ్ భార్య ప్రీణీత్ కౌర్‌కు పీసీసీ చీఫ్ పదవి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
Also Read: జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం ఇది...నాగచైతన్య ఎమోషనల్ ట్వీట్
Also Read: హౌస్ లో 'ఆకలిరాజ్యం' కష్టాలు.. ఫుడ్ కోసం ఏకంగా చెత్తబుట్టలో..