నాగ చైతన్య- సాయి పల్లవి నటించిన 'లవ్ స్టోరీ' మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లలో విడుదల చేస్తే అనుకూలంగా ఉంటుందో లేదో అనే సందేహాలకు తెరదించుతూ విడుదలైన అన్ని సెంటర్లలోనూ హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో చైతూ, సాయి పల్లవి నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సక్సెస్ ను చూసి మూవీ టీమ్ ఫుల్ జోష్ లో ఉంది. రీసెంట్‌గా 'లవ్ స్టోరీ' సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్రయూనిట్.. సక్సెస్ సంబరాలు జరుపుకుంది. నాగ చైతన్య, సాయి పల్లవి సహా మూవీ టీమ్ మొత్తం కలసి ఎంజాయ్ చేశారు. ఈ మేరకు అంతా కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఒదిగిపోయిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు నాగచైతన్య. ''లవ్ స్టోరీ టీమ్ మొత్తానికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీరంతా కలిసి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఇచ్చారు'' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ నెట్టింట్లో క్షణాల్లో వైరల్‌గా మారింది.
సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన లవ్ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైంది. ఈ సినిమా మొదటి రోజు 6.94 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా కూడా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టిందిని చెబుతున్నారు. వీకెండ్స్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటినప్పటికీ వర్కింగ్ డేస్ వచ్చేసరికి కాస్త కలెక్షన్లు నెమ్మదించాయి. విడుదలైన 4వ రోజు నుంచి గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ కూడా తగిలింది. ఇక ఐదవ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే 4 వ రోజు 2.52 కోట్ల షేర్ ని అందుకున్న లవ్స్ స్టోరి సినిమా అయిదవ రోజున కేవలం 1.26 కోట్ల షేర్ సాధించింది. ఈ సినిమాను టోటల్ గా 31.2 కోట్లకి అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే అయిదు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 5.34 కోట్ల షేర్ అందుకుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే.
Alos Read: హౌస్ లో 'ఆకలిరాజ్యం' కష్టాలు.. ఫుడ్ కోసం ఏకంగా చెత్తబుట్టలో..
Also Read: ఇండస్ట్రీ సమస్యలను రాజకీయం చేయొద్దు.. నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యలు
Also Read: 'వల్గర్ ఆంటీ.. చీప్' అంటూ జెనీలియాపై దారుణమైన కామెంట్స్.. ఘాటు రిప్లై ఇచ్చిన బ్యూటీ..