కబాబ్‌లు భలే ఉంటాయి కదా..! కబాబ్ అంటే గుర్తొచ్చింది.. ఇటీవల ఓ ఐఎస్ఐస్ ఉగ్రవాదిని ఈ కబాబ్ పట్టించిందట తెలుసా? ఇదేంటి అని షాకవుతున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. 


కబాబ్ షాక్..


ఒక్కోసారి పుడ్‌పై మనకున్న ఇష్టం.. కొన్ని కష్టాలను తెచ్చిపెడుతుంది. ఊబకాయం, ఆరోగ్య సమస్యలను పక్కన పెడితే.. ఓ ఐసిస్ ఉగ్రవాదికి ఫుడ్‌పై ఉన్న మక్కువ అతడ్ని పోలీసులు పట్టుకునేలా చేసింది.


30 ఏళ్ల అబ్దేల్ మజీద్.. బ్రిటిష్ మూలాలున్న ఓ ఐసిస్ ఉగ్రవాది. ఐసిస్‌లో శిక్షణ తీసుకున్న అనంతరం అతడు ఓ పనిమీద స్పెయిన్ వచ్చాడు. కబాబ్‌లు అంటే మజీద్‌కు చాలా ఇష్టం. చివరకి ఆ కబాబ్ యే అతడ్ని పోలీసులకు పట్టించింది.


ఎలా పట్టుకున్నారు?


2013లో అబ్దేల్ మజీద్.. సిరియాకు పారిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత స్పెయిన్‌లోని అల్మేరియాకు వచ్చాడు. స్పెయిన్ నిఘా వర్గాలు.. పోలీసులకు మజీద్‌ గురించి సమాచారమిచ్చాయి. అయితే అతడి సమాచారం కోసం పోలీసులు విశ్వప్రయత్నం చేశారు.


అబ్దేల్ మజీద్.. స్నేహితుడు సెద్దికీ అతని కోసం ఓ రెస్టారెంట్ నుంచి 2020 ఏప్రిల్ 15న రాత్రి 10.46 నిమిషాలకు కబాబ్‌ ఆర్డర్ చేశాడు. ఆ తర్వాతి రోజు మాక్రో డోనర్ నుంచి రాత్రి 10 గంటలకు రెండోసారి ఆర్డర్ చేశాడు. అనంతరం ఏప్రిల్ 18న మధ్యాహ్నం 2.48 నిమిషాలకు ఉబర్ ఈట్స్ డెలివరీ నుంచి ఆర్డర్ పెట్టాడు. ఈ మూడు ఆర్డర్‌లే మజీద్ కొంపముంచాయి. అతడ్ని పోలీసులకు పట్టించాయి.


అయితే అప్పటికే సెద్దికీపై నిఘా ఉంచిన పోలీసులు అతడ్ని ట్రాక్ చేశారు. సెద్దికీతో పాటు మరో ఇద్దరు అనుచరులను అరెస్ట్ చేశారు. 43 వేల పౌండ్ల విలువైన బిట్‌కాయిన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెద్దికీ ఆర్డర్ చేసిన అడ్రస్‌కు వెళ్లి ఉగ్రవాది అబ్దేల్ మజీద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఉగ్రవాది సోటోడెల్ జైలులో ఉన్నాడు. కబాబ్‌లపై అబ్దేల్‌కు ఉన్న ఇష్టం చివరికి అతడ్ని పోలీసులకు పట్టించింది.


Also Read:Punjab Congress crisis: కాంగ్రెస్ అధిష్ఠానం బుజ్జగింపులు.. సిద్ధూతో పంజాబ్ సీఎం భేటీ!


Also Read: జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం ఇది...నాగచైతన్య ఎమోషనల్ ట్వీట్


Also Read: హౌస్ లో 'ఆకలిరాజ్యం' కష్టాలు.. ఫుడ్ కోసం ఏకంగా చెత్తబుట్టలో..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి