ధోని: ది అన్ టోల్డ్  స్టోరీ... దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్  హీరోగా నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా థియేటర్లలోకి విడుదలై ఐదేళ్లు పూర్తైంది. నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దిశా పటానీ, కియారా అద్వానీ, అనుపమ్ ఖేర్, భూమిక చావ్లా కీలక పాత్రలు పోషించారు.  రాంచీలో ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ధోనీ...ఇంటర్నేషనల్ క్రికెటర్ గా, టీమిండియా కెప్టెన్ గా ఎదిగిన వైనాన్ని దర్శకుడు నీరజ్ పాండే 'ఎంఎస్ ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ' మూవీలో  అద్భుతంగా తెరకెక్కించారు.   ధోనీ స్కూలు రోజుల నుండి 2011లో వరల్డ్ కప్ గెలించే వరకు అతని జీవితంలో చోటు చేసుకున్న క్రికెట్ సంబంధిత అంశాలతో పాటు....క్రికెటర్ గా ఎదుగుతున్న క్రమంలో వ్యక్తి గత జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు,  తండ్రిని బాధ పెట్టలేక ఖరగ్‌పూర్ స్టేషన్లో టికెట్ కలెక్టర్ గా ఇష్టంలేని ఉద్యోగం చేస్తూ పడిన మనో వేదన, అందులో నుంచి బయట పడేందుకు, క్రికెట్లో తను అనుకున్న లక్ష్యాలను చేరడానికి ఎలాంటి రిస్క్ చేసాడు అనే సంఘటనలన్నీ ప్రేక్షకులకు అర్థమయ్యేలా వివరించాడు దర్శకుడజు నీరజ్ పాండే. 


ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు
1.హెలికాఫ్టర్ షాట్ కేరాఫ్ మహేంద్ర సింగ్ ధోనీ అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సేమ్ షాట్ ను సేమ్ టుసేమ్ కొట్టడంతో ధోనీ నుంచి అభినందనలు అందుకున్నాడు సుశాంత్. 
2.ఈ సినిమాలో క్రికెటర్ ఎంఎస్ ధోని తండ్రి పాత్రను పోషించిన ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ చాలా సంవత్సరాల మళ్లీ వెండితెరపై కనిపించారు. కొన్నేళ్ల తర్వాత ఆ పాత్ర కోసం నా మీసం కట్ చేయాల్సి వచ్చింది" అని ట్వీట్ చేశారు అనుపమ్.
3.ప్రపంచకప్ 2015 రెండో రోజున పాకిస్థాన్‌తో తలపడేందుకు ఫిర్ సే ... అనే పాటను భారత క్రికెట్ జట్టుకు సమర్పించారు.
4.నటీనటులు షూటింగ్ కోసం లండన్ బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో  చివరి నిమిషంలో పర్యటన రద్దైంది. అప్పుడు మారిషస్‌లో చిత్రీకరించారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
5.ది అన్‌టోల్డ్ స్టోరీ దర్శకుడు నీరజ్ పాండే ఓ ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడినా సుశాంత్ రాజ్‌పుత్ సరైన ఎంపిక అని చెబుతారు.  ధోనీ లానే సుశాంత్ కి కూడా క్రికెట్ పై ఆసక్తి ఉండడం సినిమాకు బాగా కలిసొచ్చిందంటారు.
6.ఈ కథలో అస్సలు  MS ధోనీ ఇన్వాల్స్ కాలేదని...తన పరిశోధకుల బృందం ఈ డేటా మొత్తం సేకరించిందన్నారు నీరజ్ పాండే.


ఇక మహేంద్ర సింగ్ ధోనీ పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆ పాత్రకు పర్ఫెక్ట్‌గా సూటయ్యాడు. ధోనీ పాత్రలో నటించాడు అనడం కంటే జీవించాడనే చెప్పాలి. ముఖ్యంగా క్రికెట్ కు


సంబంధించిన సన్నివేశాల్లో ధోనీని చూస్తున్నాం అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగించడంలో సక్సెస్ అయ్యాడు 


Also Read: జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం ఇది...నాగచైతన్య ఎమోషనల్ ట్వీట్


Also Read: హౌస్ లో 'ఆకలిరాజ్యం' కష్టాలు.. ఫుడ్ కోసం ఏకంగా చెత్తబుట్టలో..


Also Read: ఇండస్ట్రీ సమస్యలను రాజకీయం చేయొద్దు.. నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి