2021 అక్టోబరు 1 శుక్రవారం బంగారం, వెండి ధరలు 


బంగారాన్ని ముఖ్యమైన పెట్టుబడిగా చూసే భారతీయులు ధర తగ్గినా పెరిగినా  కొనుగోలు చేయాలనే అనుకుంటారు. అందుకే నిత్యం బంగారం ధరల హెచ్చుతగ్గులపై ఆసక్తి చూపిస్తారు. అయితే కొన్ని రోజులపాటూ స్వల్పంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. భారత్ మార్కెట్లో ఈ రోజు  ( అక్టోబరు 1 శుక్రవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 43,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ46,960 ఉంది. ఇక ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలెలా ఉన్నాయో చూద్దాం.


దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,310
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,360, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,490
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250 
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,960
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,930
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,960
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,960 
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ46,960
పూణే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,480, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,620
బరోడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ44,740, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,180 
అహ్మాదాబాద్ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,980 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 
జైపూర్ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,300 
లక్నో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.  46,600 
నాగ్‌పూర్‌ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,490 
సూర‌త్ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,980, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,100 
భువ‌నేశ్వ‌ర్‌ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,200


వెండిదీ అదేదారి: బంగారం బాటలోనే వెండి కూడా తగ్గింది. శుక్రవారం దేశీయంగా ప్రధాన ప్రాంతాల్లో వెండి ధరలు పరిశీలిస్తే.. కిలో వెండిపై దాదాపు రూ.2వేలకుపైగా తగ్గుముఖం పట్టింది.  ఢిల్లీలో కిలో వెండి రూ.58,300, చెన్నైలో రూ.63,000,  ముంబైలో కిలో వెండి రూ.58,300,  కోల్‌కతాలో రూ.58,300, ఇక బెంగళూరులో కిలో వెండి రూ.58,300, కేరళలో రూ.63,000 ఉండగా హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణంలో కూడా రూ.63,000 ఉంది.                                                                                                                                                                                                                                               


దీపావళినాటికి ధర భారీగా పెరిగే అవకాశం: అయితే బంగారం, వెండి ధరల్లో  నిత్యం స్వల్ప హెచ్చుతగ్గులున్నా దిపావళి నాటికి బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఏకంగా పది గ్రాముల బంగారం  రూ.57 వేల నుంచి రూ.60 వేల వరకు చేరుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న రేట్లపై దాదాపు పదివేలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. వెండి ధరలు కూడా బంగారం ధరలనే ఫాలో అవుతాయంటున్నారు.                                                                                                                                                                                         


వివిధ అంశాలపై పసిడి ధర: బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.


Also Read: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏపీలో విపరీతంగా.. మీ ప్రాంతంలో తాజా ధరలు ఇవే..


Also Read: అక్టోబరులో మొదటి రోజు ఈ రాశుల వారు శత్రువులపై గెలుపు సాధిస్తారు, వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం...


Also Read: కత్తులతో ఫసక్.. సన్నీకి చుక్కలు చూపించిన హౌస్‌మేట్స్, కెప్టెన్ ఎవరంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి