దేశవ్యాప్తంగా కోవిడ్ తీవ్రత కొనసాగుతోంది. నాలుగు రోజుల క్రితం 18 వేలలో నమోదైన కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా దేశంలో 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 26,727 మందికి కోవిడ్ పాజిటివ్‌ అని తేలింది. మొత్తం 15.20 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు వెల్లడైందని ఐసీఎంఆర్ వెల్లడించింది. నిన్న నమోదైన కోవిడ్ కేసులతో (23,529) పోల్చితే ఈరోజు 3 వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.


Also Read: బూస్టర్ డోసుపై ఏ నిర్ణయం తీసుకోలేదు.. యువతకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యం... స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ


ఇక నిన్న ఒక్క రోజే 28,246 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,30,43,144కి పెరిగింది. 277 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 4,48,339కి పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,75,224 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈరోజు కేసులతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 3,37,66,707 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు మొత్తం 89,02,08,007 మందికి కోవిడ్ టీకాలు అందించారు. నిన్న ఒక్క రోజే 64,40,451 మందికి వ్యాక్సిన్లు వేశారు. 


Also Read: ఎవరు గొప్ప అంటూ చెలరేగిన ఘర్షణ.. విద్యార్థి ప్రాణాల్ని బలిగొన్న కొట్లాట.. విశాఖలో దారుణం


కోవిడ్ రికవరీ రేటు 97.86 శాతంగా ఉంది. క్రియాశీల కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశంలో క్రియాశీల రేటు 0.82 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా నమోదైన కొత్త కేసుల్లో సగానికి పైగా ఒక్క కేరళలోనే ఉన్నాయి. అక్కడ నిన్న 15,914 మంది కోవిడ్ బారిన పడగా.. 122 మంది మరణించారు. 









Also Read: వర్క్ ఫ్రం హోం ఇక ముగిసినట్లే.. ఆఫీసులు తెరవనున్న దిగ్గజ కంపెనీల జాబితా ఇదే..


Also Read: క్యాన్సర్ చికిత్సలో కౌన్సెలింగ్‌ పాత్ర కీలకం.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి