హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ (సీ-డాక్/ CDAC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ప్రాజెక్టు ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. ఈ పోస్టుల దరఖాస్తు స్వీకరణ గడువు మరో రెండు రోజుల్లో (అక్టోబర్ 5) ముగియనుంది. పైన పేర్కొన్న ఉద్యోగాలకు సంబంధించిన విభాగాల్లో బీఈ, బీటెక్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కొన్ని పోస్టులకు సంబంధిత రంగంలో అనుభవంతో పాటు టెక్నికల్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఆసక్తి గల వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలతో పాటు అధికారిక నోటిఫికేషన్ కోసం https://www.cdac.in/index.aspx?id=ca_advt_04_sept_2021 వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
Also Read: ఐటీఐ విద్యార్హతతో రైల్వేలో 3093 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
సీ-డ్యాక్ అనేది భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థ. ప్రస్తుతం ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనుంది. సైబర్ సెక్యూరిటీ అనాలసిస్, మొబైల్ సెక్యూరిటీ, ఎంబెడెడ్ సిస్టం, సాఫ్ట్ వేర్ టెస్టింగ్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది.
విభాగాల వారీగా ఖాళీలు..
పోస్టు | అర్హతలు | ఖాళీల సంఖ్య |
ప్రాజెక్టు ఇంజనీర్ | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి. | 36 |
ప్రాజెక్టు మేనేజర్ | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో 7 నుంచి 11 ఏళ్ల అనుభవం అవసరం | 01 |
ప్రాజెక్టు అసోసియేట్ | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 60శాతం మార్కులతో బీఈ, బీటెక్, ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి. | 01 |
Also Read: రేపు తెలుగు రాష్ట్రాల్లో అప్రెంటిస్ మేళా.. 5వ తరగతి చదివిన వారు కూడా అర్హులే..
ఇలా అప్లయ్ చేసుకోండి..
1. సీ-డ్యాక్ అధికారిక నోటిఫికేషన్ https://www.cdac.in/index.aspx?id=ca_advt_04_sept_2021 లింక్ క్లిక్ చేయండి.
2. ఇక్కడ ప్రతి పోస్టుకు సంబంధించిన వివరాలు ఉంటాయి.
3. పోస్టు పక్కనే డిటైల్స్ (Details) ఆప్షన్ ఉంటుంది. దీనిని క్లిక్ చేస్తే పోస్టు వివరాలు కనిపిస్తాయి.
4. ఇక్కడ అప్లయ్ (Apply) ఆప్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
5. అభ్యర్థులు తమ వివరాలు అందించి సబ్మిట్ చేయాలి. దీంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
Also Read: రంగారెడ్డి జిల్లాలో మెడికల్ ఆఫీసర్ జాబ్స్.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
Also Read: ఐబీపీఎస్‌లో ఉద్యోగాలు.. రూ.1.66 లక్షల వరకు వేతనం.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం..