ముంబయి నుంచి గోవా వెళ్తున్న ఓ క్రూయీజ్ షిప్‌లో రేవ్ పార్టీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వాడకం ఈ పార్టీలో భారీగా ఉందన్న సమచారంతో అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలోనే ఓ బాలీవుడ్ అగ్ర హీరో తనయుడు కూడా పట్టుబడ్డాడు. అయితే, సముద్రం మధ్యలో ఉన్న షిప్‌లో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సోదాలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్సీబీ అధికారులు విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. 


‘‘మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ముంబయి ఎన్సీబీ అధికారులు కోర్డేలియా క్రూయీజ్ షిప్‌లో సోదాలు చేశారు. ఈ షిప్ ముంబయి నుంచి అక్టోబరు 2న గోవాకు బయలుదేరింది. ఈ తనిఖీల్లో మాకు వచ్చిన సమాచారం ఆధారంగా అందరు అనుమానితుల వద్ద తనిఖీలు చేశాం. ఎండీఎంఏ/ఏక్టాసీ, కొకైన్, మెఫిడ్రోన్, చారాస్ వంటి మాదకద్రవ్యాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నాం. మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నాం. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. అదుపులోకి తీసుకున్న అందర్నీ విచారణ జరుపుతున్నాం. మరింత విచారణ జరుగుతుంది.’’ అని తెలిపింది.


Also Read : పోలీసుల్నే బురిడీ కొట్టించిన దొంగ.. డబ్బు కొట్టేసేందుకు మాస్టర్ ప్లాన్, చొక్కాతో అసలు గుట్టు బయటికి..


ఎలా ప్లాన్ చేశారంటే..
జాతీయ వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ముంబయి నుంచి గోవా వెళ్లే క్రూయీజ్ షిప్‌లో ఈ పార్టీ జరుగుతున్నట్లుగా కొద్ది రోజుల క్రితమే సమాచారం వచ్చింది. ఎవరికీ అనుమానం రాకూడదనే ఉద్దేశంతో ఎన్సీబీ అధికారులు ఆ షిప్‌లో ప్రయాణికుల్లాగా టికెట్లు బుక్ చేసుకున్నారు. ప్రయాణికుల్లాగానే లోనికి ప్రవేశించారు. అక్కడ తోటి ప్రయాణికులు డ్రగ్స్ తీసుకుంటుండడం చూశారు. వారు డ్రగ్స్ ప్యాకెట్లను తమ ప్యాంట్లు, హ్యాండ్ బ్యాగ్‌లు, షర్ట్ కాలర్ల వద్ద ఉండే కుట్ల భాగంలో దాచుకొని డ్రగ్స్ సేవించినట్లు గమనించామని అధికార వర్గాలు తెలిపాయి.


Also Read: ఈ సారి "శాక్రిఫైజ్" అయినట్లే !? పోలీసులపైనే వీడియోలు పెట్టి దొరికిపోయిన సునిశిత్ !


అయినా అధికారులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడం ద్వారా మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఈ డ్రగ్స్ పార్టీని సముద్రం మధ్యలో ఏర్పాటు చేశారు. అక్కడైతే పోలీసులు దాడులు చేస్తారనే భయం ఏమీ ఉండదు. షిప్‌లో సముద్రం మధ్యలో రేవ్ పార్టీ కాబట్టి.. దీని ఎంట్రీ ఫీజు కూడా భారీగానే పెట్టారు. దాదాపు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకూ ఉండనున్నట్లు తెలుస్తోంది. 


ఈ క్రూయీస్ షిప్ మొత్తం ప్రయాణికుల సామర్థ్యం 2 వేల మంది. కానీ, దాడుల సమయంలో లోపల వెయ్యి మంది మాత్రమే ఉన్నారు. 


Also Read: సముద్రం మధ్యలో రేవ్ పార్టీ.. భారీగా డ్రగ్స్ పట్టివేత, అదుపులో టాప్ హీరో కొడుకు..!


Also Read : ఆమిర్ ఖాన్ తో అక్కినేని ఫ్యామిలీ డిన్నర్ పార్టీ.. సమంత ఎక్కడ..? అంటూ నెటిజన్ల ప్రశ్నలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి